పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/597

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ రుంజ వాయిద్యం తోనే పార్వతీ దేవి కళ్యాణం రంగరంగ వైభోగంగా దేవతలందరూ కలిసి చేశారనీ విశ్వకర్మ పురాణంలో వివరించబడింది.

రుంజ:

రౌంజకుడనే రాక్షసుని చర్మాన్ని రుంజ ల్వాయిద్యానికి వినియోగించడం వల్ల, రౌంజ అనే పేరు ఏర్పడి, కాలక్రమేణ అది రుంజగా రూపాంతరం చెందింది. రుంజను ఇత్తడితో తయారు చేస్తారు, ఈ వాయిద్యాన్ని బలమైన కఱ్ఱపుల్లలతో వాయిస్తారు. ఏట వాలుగా ముందుకు వంచి, కదలకుండా మోకాలితో అదిమిపట్టి, చేతులతో త్రాడును లాగి, శ్రుతి చేసి, తాళం ప్రకారం వరుసలతో ఉధృతంగా వాయిస్తారు. రుంజ వాయిద్యకులను రుంజవారని పిలవటం కూడ వాడుకలో వుంది.

రుంజ వాయిద్యకులు ఒక వేళ వ్వవసాయాన్ని కలిగి వున్నా, ప్రధానంగా రుంజ వాయిద్యాన్నే వృత్తిగా స్వీకరిస్తారు. బాల్యం నుంచీ, విద్యాభ్యాసముతో పాటు ఈ విద్యను కూడ కట్టుదిట్టంగా ల్నేర్చు కుంటారు. ప్రతివారూ ఈ విద్యలో ఉత్తీర్ణులై, గ్రామాలకు యాత్రలు సాగిస్తారు. సంసారాలతో పాటు ఎడ్లబండ్లలో బయలుదేరుతారు. నిత్య జీవితానికి కావలసిన వంట పాత్రలు మొదలైనవ వాటిని కూడ వారితోనే వుంచుకుంటారు.

ఏ గ్రామానికి చేరుకున్నా వారు విశ్వ బ్రాహ్మణులను మాత్రమే యాచిస్తారు. విశ్వబ్రాహ్మణులు వీరిని ఎంతగానో ఆదరించి వారికి ధన ధన్యాలను దానం చేస్తారు. రుంజ వాద్యకులు, వారి వాయిద్యాలతో, గానంతో, కథలతో వారిని రంజింపచేస్తారు. సంగీత శాస్త్రానికి సంబంధించిన సప్తతాళాల్నీ, ముప్పైరెండు రాగాలనూ వారి ప్రదర్శనాల్లో ప్రదర్శిస్తారు.

రుంజ వాయిద్యకులు ఒక గ్రామానికి వచ్చారంటే, ముందుగా భేరి మోతలతో రుంజ వాయిద్యాన్ని ఉధృతంగా గమకాలనిస్తూ వాయించడంతో రుంజవారు గ్రామంలోకి వచ్చారనేది అందరికీ అర్థమైపోతుంది.

పల్లెల్లో ప్రదర్శన:

గ్రామంలో ప్రవేశించిన రుంజవారు ఒక రాత్రి విశ్వబ్రాహ్మణులకు కథను వివరిస్తారు. పంచ బ్రహ్మలను గురించి, వారి యొక్క వంశోత్పత్తిని గురించీ