పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/589

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఏడుగురు అన్నదమ్ములు:

వెంకటేశ్వరుని అన్నదమ్ములు ఏడుగురు. వేంకటేశ్వరుడు చిన్న వాడు. శ్రీనివాసులు అని కూడా పిలుస్తూ వుండేవారట. శ్రీనివాసులు తిమ్మరాజు పేరిందేవిల ఏడవ మగ బిడ్డ. శ్రీనివాసుని యొక్క సోదరుల పేర్లు 1.గోవిందరాజులు, 2.పెన్నాడ వెంకన్న శ్రీకాకులం జిల్లా, 3. ఉప్పాల వెంకన్న ( పిఠపురం తాలూకా), 4. బెండపూడి వెంకన్న, 5. యానాం వెంకన్న, 6. వాడపల్లి వెంకన్న, 7. అఖరివాడుగా శ్రీనివాసుడు జన్మించాడట. కాని ఈ ఏడుగురు అన్నదమ్ముల కంటే ముందు విజయవాడలో వేంచేసి యున్న కనకదుర్గ, తిమ్మరాజు, పేరిందేవిల మొదటి సంతానమనీ ఈ కథను చెప్పే కొంత మంది గురువుల చెపుతూ వుంటారు.

తిరుపతి వెంకన్న:

అందరిలోకి చిన్నవాడైన వేంకటేశ్వరుడు, తల్లి దండ్రులను విడిచి పెట్టి తిరుపతి కొండకు చేరి ఆ కొండ మీదే దేవాలయాలు కట్టించుకున్నాడని, పద్మావతిని, బీబీ నాంచారిని వివాహం చేసుకుని, తిరుపతి కొండ మేదే నివాసం ఏర్పరుచుకుని శిలా విగ్రహాలుగా మారిపోయారని కథను పూర్తి చేస్తారు.

కోలసంబరం ప్రదర్శనంలో అందరూ మగవారే పాల్గొంటారు. రాత్రి ఎనిమిది లేక తొమ్మిది గంటలకు కథను ప్రారంభించి ఉదయం ఆరు గంటల వరకు ఈ సంబరం చేస్తారు. ఈ కథను చెప్పేవారిలో ఒకనికి పూనకం వస్తుంది. పూర్వం ఈ సంబరంలోకి ఆబోతును తీసుకువచ్చి సంబరం అయిన తరువాత ఆబోతును ఊరిమీదికి వదలిపెట్టేవారు. కానీ ఈనాటి ప్రదర్శనాలలో ఆబోతును తీసుకురావడంలేదు.

బృందాల సంబరాలు:

చిక్కాల కోటయ్య సంబరాలు చేసే రోజుల్లో ఆబోతుని సంబరంలోనికి తీసుకు వచ్చే వారు. కోటయ్య చనిపోయి ఇప్పటికి షుమారు నూరు సంవత్సరాలైంది.

ఈనాడు కథలు చెప్పే బృందాలు నెలకు ఆరు కథలకు తక్కువ కాకుండా చెపుతారు. ఒక్కొక్క గురువుకూ నెలకు సరాసరి ఆరు

TeluguVariJanapadaKalarupalu.djvu

వందల రూపాయలు ఆదాయం వస్తుంది. వెల్లగ్రామంలో షుమారు ఏభై బృందాల వరకూ వున్నాయి. వెల్ల గ్రామం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకాలో వుంది.