పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఈ నృత్యంలో ముఖవీణలు వాయించే బారని, మృదంగ విద్వాంసుల్ని, లయ ప్రకారం తాళం వేయగల తాళమానజ్ఙల్ని, బహురాగాలను అన్ని స్థాయిలలోను పాడగల ప్రజ్ఞావంతుల్ని జంట గాత్రాలు కలిపి రాగం ఆలాపించే రమణుల గూర్చి కూడా వివరింఛాడు శ్రీనాథుడు.

శైవ, వైష్ణవ మతాల చైతన్యం:

ఇంతటి లలితకళావికాసంతో వర్థిల్లిన పలనాటి సీమలో అన్నదమ్ముల కలహాల కారణంగా పల్నాటి యుద్ధం ప్రారంభమైంది. పల్నటి యుద్ధానికి కేవలం రాజకీయ కారణాలే కాక సాంఘికమైన ప్రాధాన్యం కూడ ఎంతో వుంది. రామానుజుని వైష్ణవ మతం 11వ శతాబ్దంలో తమిళదేశంలో ప్రారంభమై ఆంధ్రదేశంలో ప్రవేశిస్తే, బసవయ్య వీరశైవ మతం 12 వ శతాబ్దంలో కన్నడ దేశంలో ప్రారంభమై ఆంధ్రదేశంలో ప్రవేశించింది. ఈ రెండుమతాల ప్రాబల్యమూ పలనాటి యుద్ధం మీద చాల వుంది.

వైష్ణవ మతం ఆంధ్ర దేశంలో ప్రవేశించక ముందు నుంచీ శైవమతం చాలకాలంగా ఆంధ్రదేశంలో ప్రచారంలో వుంది. చాళుక్యరాజులు ఎక్కవమంది శైవమతాన్ని ప్రోత్సహిస్తే తెలుగు చోడులు శైవ, వైష్ణవ మతాలు రెంటినీ సమన్యయ దృష్టితో ఆదరించారు.

ఈ మతాలు విజృంభణ ఆనాటి సాంఘిక ఆచార వ్వవహారాలలో, సంగీతంలో, నృత్యంలో సాహిత్యంలో, దేవాలయ వాస్తు నిర్మాణంలో, శిల్పంలోనూ ఎంతో మార్పు తీసుకు వచ్చింది.

శైవ మత చిద్విలాసాలు:

విష్ణుకుండిన వంశం తరువాత ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన పూర్వ చాళుక్యులు వైదిక మార్గ నిరతులైనప్పటికి ఈ వంశంవారిలో చాల మంది శైవమతాన్ని అవలంబించిన పరమమహేశ్వరులున్నారు. వీరి కాలంలో ఇతర ప్రాంతాల నుండి పాశుపతి శివాచార్యులు తెలుగు దేశానికి వచ్చి, పాశుపత శైవ సంప్రదాయాన్ని వ్వాపింప జేసి శివాలయాల్లో స్థానాపతులుగా వున్నారు. అట్టి వారిలో మొట్టమొదటి సారిగా తెలుగు శాసనాలలో తెలిపినవారు వామశివ, పురుషశివ అనే పేర్లు గల శివాచార్యులు. వీరు చాళుక్య కులజుడైన మంగి యువరాజు పుత్రుడైన విష్ణు వర్థనుని