పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/573

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సారిగా హుషారుగా, ఎగురుతూ, పాడుతూ, పాట కనుకూలంగా అడుగులు వేస్తూనే కోలాటం వేయటాన్ని ఉసెత్తుకోవటం అంటారు. దీనినే త్వరితం ఉసి _ దుడుకు అని కూడ అంటారు. ఇలా ఆటలో ఉసెత్తుకోవడం ప్రేక్షకులను ఎంతో ఆనందపరుస్తుంది.

ముక్తాయింపు:

ముక్తాయింపు అంటే పాట, ఆట, ఒక దశకు చేరిన తరువాత ఆటను తెగగొట్టడం అంటారు. సామాన్యంగా ఇతతయ్యకు తాధిమిత, అనే చరణాన్ని గాని__కిటకిట తయ్యకు తద్ధిమిత అనే చరణాన్ని గాని వాడుతారు. ఈ చరణాన్ని ముక్తాయింపు చరణం అంటారు. తరువాత మరొక ఎత్తుడలో మరొక పాట, మరలా ఉసి, తరువాత ముక్తాయింపు. ఇలా కోపు కోపుకు ఎత్తుగడ, ఉసెత్తు ముక్తాయింపులు వుంటాయి.

కోలాట సామగ్రి:

కోలాట కర్రలు మొదట సన్నగానూ, మద్యలో ఉబ్బెట్టుగానూ, చివర సన్నగానూ వుంటాయి. పట్టు కోవడానికి వీలుగా పిడి వుంటుంది. ఈ కర్రలను చేవకలిగిన బిల్లుడు_ చండ్ర_ ఏపె_ రేల _ టేకు _ ఏగెస మొదలైన జాతుల చెట్లనుంచి కర్రలను ఎంచుకుంటారు.

ఈ కోలాటపు చిరుతలను చక్కగా చిత్రిక పడతారు. పిడివద్ద అందెలనూ, కోలచివర గజ్జెలనూ ఏర్పాటు చేస్తారు. కోలాటం వేశేటప్పుడు వీటి ధ్వని మధురంగా వుంటుంది.