పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ తరుణంలో ఆంధ్రదేశంలో వెలనాటి చోడుల ఆధిపత్యాన అనేక మంది సామంత రాజులు పరిపాలించారు. నిజానికి వీరంతా సర్వ స్వతంత్రులు. ఈ చిన్న రాజ్యాల మద్య అనేక తగాదాలు, వైషమ్యాలు పెరిగిపోయి, 1172, 1882 మధ్య కాలంలో గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా కార్యంపూడిలో పల్నాటి యుద్ధంగా పరిణమించింది.

పల్నాటి వీర చరిత్రను గురించి ఆంధ్రదేశంలో తెలియని వారెవరూ లేరు. ఈ వీరకథను పలనాటిలో పర్యటించిన శ్రీనాథ మహాకవి ద్విపద కావ్యంగా రచించాడు. దీనిని ఆంధ్రదేశంలో జానపద గాయకులైన పిచ్చుగుంటల వారు విపరీతంగా ప్రచారంలోకి తీసుకువచ్చారు.

వినోదాల వర్ణనలో శ్రీనాథుని కవితా వైభవం:

పలనాడులో గురజాల రాజాధానిగా పరిపాలించిన నలగామరాజు దర్బారులో జరిగే అనాటి సంతీత నృత్య వాద్య విశేషాలను శ్రీనాథుడు ఈ విధంగా వర్ణించాడు:

వింతగా గాయనుల్ వీణలు బూని - తంత్రులు బిగియించి తగ సుతిబెట్ట
సరిగమేళములైన స్వరసప్తకంబు - ఆరోహణావారోహణ భేదములను
బహునాగ సంప్రాప్తి వట్టుగా జేర్చి - సంచారి సంస్థాయి సరస భావముల
మృదుతర శబ్దార్థ మిళితమైనట్టి - ఘనతరాలంకార గతిపరంపరలు.

నాట్య మేళమువారి, నవ విలాసాలు:

ముార్ఛనల్ మొదలైన ముఖ్య ధర్మములు - జంతగాత్రంబులు జంటగావించి
చెలగి యెండిన చెట్లు చిగిరించునట్లు - పాడిరి తమతమ ప్రావీణ్య మెసగ
పాకశాసను కొల్వుపగిది నున్నట్టి వేళ -నేతెంచిరి విద్యాధికతను
నాట్యమేళమువారు నవ విలాసముల- వచ్చి నమ్రత మ్రొక్కి ప్రక్కగా నిల్వ
ఘనవైభవంబున కామ భూవిభుడు- నవ్వుచు సెలవెచ్చె నాట్యంబు చేయ
న(?)ర మృదంగములెస్స వాయించు- మేటి కుడి భాగమున యందు కుదురుగా నెలిచె..
తాళమానజ్ఞులు దాపటి దిశను- నిలిచి రుత్సాహంబు నేరుపు మీర
ముఖ వీణ వాయించు ముఖ్యు డొక్కండు- రాగ మాలాపించు రమణు లిద్దరును