Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/556

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంటూ అయ్యవార్లకు ఎక్కువ మొత్తాన్ని రాబట్టే వారు. ఇలా ఊరిలో పిల్లలందరి ఇళ్ళకూ వెళ్ళి, ఎక్కువ మొత్తంలో వసూలు చేసేవారు.

పిల్ల తల్లిదండ్రులు, వారి పిల్లలు కూడా తోటి పిల్లలతో రావటం వల్ల ఘనంగానే దక్షిణ లిచ్చేవారు. ఒక ప్రక్క పిల్లలు ఎంతో ఉత్సాహంతో ముచ్చటపడుతుా వుంటే, గురు దక్షిణలు అందుకున్న ఉపాధ్యాయులు, పారితోషికాలతో సంతోషపడిపోయేవారు.

ఇలా ప్రారంభమైన దసరా మామూళ్ళు, రాను రాను గురు శిష్య సంప్రదాయాన్ని వదిలి ప్రభుత్వ శాఖలలో వున్న వారు సాంఘీక

ఆరాచక శక్తులు ఈనాడు మామూళ్ళు వసూలు చేస్తున్నారు. గురువుల స్థానంలో దుష్ట శక్తులు విజృంభించాయి ఈనాడు.


విజ్ఞులు చెప్పిన వీధి పురాణం

పూర్వం అ పల్లెల్లో మహాభారతం, భాగవతం, రామాయణం, గరుడ పురాణం, బసవ పురాణం, దేవీ భాగవతం మొదలైన పురాణ గాథలను చదవటం తేట తెలుగులో గ్రామ ప్రజలకు అర్థమయ్యే శైలిలో చెప్పడం ఆనాడు ఆచారంగా వుండేది. ఆనాటి ముఖ్యమైన వినోదాలలో వీధి పురాణం చెప్పడం ఒకటి. గ్రామంలోని ధనికులు, గ్రామ రెడ్లు, పండితులు, బ్రాహ్మణులు మొదలైన వారు నిర్వహించే వారు.