నాలుగు వ్రేళ్ళతో వాయిస్తారు. డమరుకం నుంచి పుట్టే ధ్వనులు ఇలా వుంటాయంటారు కృష్ణా రెడ్డి గారు,.
డడబుడ్డ బుడ్ - ఇరడడ బుడ్డ
బుడబుడ్డ బుడ్ - బుడబుడ్డ బుడ్
బుడబుడ్డ బుడ్ - బుడబుడ్డ బుడ్
గొరవయ్యలు ఒకరు మొదలు ఎంత మందైనా నృత్యం చేస్తారు. డమరుకాన్ని వాయిస్తూ పిల్లన గ్రోవిని ఊదుతూ సరి సంఖ్యలో గుండ్రంగా తిరుగుతూ, వయ్యారంగా నడుమును త్రిప్పుతూ నృత్యం చేస్తారు.
- శ్రీశైల మల్లన్న:
ఒకరు పాట పాడుతుండగా మిగిలినవారంతా పాట వంత పాడుగారు. అలా అన్ని గొంతులు కలపటం ఒక్కొక్క కాలిని కొద్ది మంది నేలపై కొడుతుండగా గజ్జెలు ఘల్లుమని మ్రోగుతాయి.
ఆ పాట ఇలా ప్రారంభమౌతుంది.
శివుడు శీనయ్య శ్రీ శైల మల్లయ్య
కానగ రావయ్యా శీనయ్య
సిక్కు జడలవాడు శివనీల కంఠుడు
అని పాడుతూ డమరుకాన్ని ఈ వరుసలో వాయిస్తారు.
తక్ తక తక్
తక అక తక్
తక తక్ తక్
తక్ తక్ తక్
అంటూ వాయిస్తారు.
- శివరాత్రి నాడు:
శివరాత్రి నాడు మల్లయ్య కొండకు పోతూ గ్రామాల వారికి కొండను గూర్చి, దేవాలయాన్ని గూర్చి, కష్టాలు కడతేర్చే దేవుణ్ణి గూర్చి, కోనేరు లోతు పాతుల్ని తెలియ జేస్తూ ఇలా పాడు కుంటూ పోతారు.