Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/464

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గొంతాలమ్మ అశ్వనృత్యం


అశ్వనృత్యాలు ఎక్కువగా కృష్ణా గుంటూరు జిల్లాలలో వున్నాయి. అశ్వ నృత్యాలను ముఖ్యంగా హరిజనులు దసరా సమయాలలో గొంతాలమ్మను పంట చేలో ప్రతిష్టించి తొమ్మిది రోజులు వుత్సవం జరిపి తరువాత గొంతాలమ్మను తృప్తి పరిచి వుత్సవంతో సాగనంపుతారు. ఈ సందర్భంలో వివిధ విచిత్ర వేషాలు ధరించి చుట్టు ప్రక్కల గ్రామలన్నీ సంచారం చేసి డబ్బు, ధాన్యం వస్త్రాలు సంపాదిస్తారు.

అశ్వ నృత్యం:

వీరి ప్రదర్శనల్లో ప్రాముఖ్యం వహించేది అశ్వ నృత్యం. మొడ వరకు గల ఒక గుఱ్ఱపు తలను పేడతో చేయించి వివిధ వార్నీషు రంగులతో అలంకరించి, ఇతర శరీర భాగాన్నంతా, తేలిక వెదురు బద్దలతో గుఱ్ఱపు ఆకారాన్ని తయారు చేసి చుట్టూ ఎఱ్ఱ చంగు చీరను కట్టి, ఆ గుఱ్ఱాన్ని చంకలకు తగిలించుకుని వెనకకూ, ముందుకూ నడుస్తూ, మధ్య మధ్య ఎగురుతూ, కేలమ్మ కేల్ భాయి కేల్, అబ్బబ్బ రాయుడే అల్బాడి బుంగడే అంటూ అద్భుతంగా నృత్యం చేస్తారు. వీరి నృత్యానికి ఉత్తేజం కలిగించేది డప్పుల వాయిద్యం. ఈ వాయిద్యపు వరుసల గమకాల ననుసరించి నృత్య గతిని మార్రుస్తూ ఉధృతంగా నృత్యం చేస్తారు. ఈ నృత్యంలో డప్పు వాయిద్యాన్ని నిలిపి అందరూ సమిష్టిగా చేతుల్లో చిరుతలు ధరించి ఈ విధంగా పాట పాడుతూ నృత్యం చేస్తారు.

పాడే పాట:

1. కంచెల చెరిగే చేడి కురులపై
లలన కురులపై
2. తుమ్మెద లాడిన ఓ లలనా,
ఘన తుమ్మెద లాడిన ఓ లలనా ॥కం॥