పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/326

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయం. అంబరీషోపాఖ్యానం మొదలైన కథలను కూడ ప్రచారంలోకి తెచ్చారు. జంగాలు వీర శైవ ప్రచారకులు కావడం వల్ల వారి కథలన్నీ వీరా వేశంతో చెప్పబడుతూ వుండేవి. ధేనువు కొండ వెంకటయ్య గారి విరాట పర్వం జంగం కథలో జంగాల యొక్క వేష ధారణ, వాయిద్యాల వర్ణనవుంది... ఆడిదం సూరకవి జంగాలు పాలు దేవాంగుల విత్తంబు అని వర్ణిచడంవల్ల, దేవాంగులైన సాలెవారిని యాచిస్తారని తెలుస్తూ వుంది.

ఆంధ్రదేశంలో శారగకాండ్రు అనే ఒక జాతి వారు, ఒక్క తెలంగాణాలో తప్ప మరెక్కడా అంతగా కనిపించరనీ, జానపద గాయకులుగా బిక్షకులుగా వుండే వారిలో కూడ వీరెక్కువనీ, మున్నూరు ముతరాసి మొదలైన కులముల నుండి ఉద్భవించిన జాతుల్లో శారద కాండ్ర జాతి ఒకటని జానపద వాఙ్మయంలో... బి. రామరాజుగారు వుదహరించారు. ఓ భారతీ, కరుణామతీ భళి, శారదా, కరుణానిధి అనేవంత పాట పాడటంవలన కూడ వీరికి శారద కాండ్రూనే పేరు వచ్చి వుండవచ్చు. అంతే కాక, వీరు పయోగించే వాద్యంలో భుజము మీద ధరించే తంబురాకు శారద అనిపేరు. బుర్ర కథలో ఉపయోగించే తంబురాకూ దీనికీ ఏమీ తేడాలేదు. శారదను ఒక భుజం మీద ధరించి వాయిస్తారు. శారద అంటే సరస్వతి. విద్యల తల్లి, సరస్వతి పేరును వారుపయోగించే తంబురా వాయిద్యానికి మారుపేరుగా శారదా అని నామ కరణం చేశారు. వీరి కథ శారదాదేవి స్తోత్రంతో ప్రారంభమౌతుంది. ముఖ్యంగా వీరి జట్టులో పురుషుడు కథ చెపితే అతని ఇద్దరు భార్యలూ వంత పాడుతారు. ఒక భార్యను కలిగి వున్న కథకుడు కథచెపితే, అతని భార్య డక్కీ కొడుతుంది. దీనిని వీరు డిమ్కీ అని కూడ పిలుస్తారు. వీరు పాడే పాటల్లో శారద వరుసలనే కాక చారిత్రాత్మకమైన గేయాలను వీరావేశంతో పాడుతారు. తెలంగాణాలో ప్రచారంలో వున్న ప్రసిద్ద వీరకథ లైన సదాశివ రెడ్డి కథ, సర్వాయి పాపడు కథలనూ, సర్కారు ఆంధ్రదేశంలో ప్రఖ్యాతి వహించిన బొబ్బిలి యుద్ధం, పల్నాటి వీరచరిత్ర, బాలనాగమ్మ మొదలైన కథలనూ శారద కాండ్రు చెపుతూ వుంటారు. పైన వుదాహరించిన ఒక్కొక్క కథనూ, మూడు నాలుగు రాత్రులు చెపుతారు. ఈ కథలు చెప్పేవారు ఎక్కువమంది వరంగల్లు తాలూకా వెంకట్రావుల పల్లి మొదలైన చుట్టుపట్ల గ్రామాలలో వున్నారు. శారద కాండ్రు అందరూ శైవమతస్థులు. మాంసాహారులైన జంగమ జాతివలన కలిగిన జాతి. ఈ శారద కాండ్రు అని కొందరి అభిప్రాయం. వీరు ఎల్లమ్మ, పోచమ్మ మొదలైన ముఖ్య దేవతల్ని