పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/324

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


"పాల్ డేనియల్" ఈ ఇండియన్ రోప్ ట్రిక్ ను ఏ భారతీయ ఇంద్ర జాలికుడూ ఇప్పుడు ప్రదర్శించడం లేదనీ ఆ కళ అంతరించిందని, తను వ్రాసిన "మేన్ విత్ అండ్ మ్యాజిక్ " పుస్తకంలో ప్రకటించారు. ఇటీవల కాలంలో ఇండియా వారు తమ అద్భుతమైన ఆ కళను ప్రదర్శించ లేక పోవడానికి కారణం కూడా పాల్ ఆ పుస్తకంలో పేర్కొన్నాడు.

భారతీయులు నాగరికత వ్వామోహంలో పడి అడవులను నరికి వేయుటమే నన్న పాల్ వ్వాఖ్యలను పట్టాభిరాం గారు ఉటంకించారు.

ఆరు బయలులో, ఆద్భుత ప్రదర్శన:

ఈ ఇండియన్ రోప్ ట్రిక్ ఒక పెద్ద ఆరుబయలు రంగ స్థలంలో ప్రదర్శిస్తారని, అప్పుడు చెట్లతో నిండియున్న ఆ ప్రదర్శనంలో ఇంద్రజాలికుడు ప్రదర్శనకు ముందు రోజు రాత్రి రెండు చెట్లకు ఒక ధృఢమైన త్రాడును బిగించి ఉంచుతాడని ప్రదర్శన సమయంలో తన చేతిలో వున్న త్రాడును పట్టుకునే విధంగా విసురుతాడు. అప్పుడు ఆ త్రాడు నిలబడి వున్నట్లుగా ఉన్న తరువాత తన తోటి ఇంద్ర జాలికుని దానిపైకి ఎక్కి వెళ్ళమంటాడు. అప్పుడు ఆ రెండవ అతను ఎక్కి వెళ్ళి మాయమై పోతాడు. నిజానికి అతను మాయమై పోవటం జరగదు. చెట్ల గుబురుల్లో నుంచి క్రిందికి దిగి వస్తాడు. ఇదే ఆ ట్రిక్.

శిథిలమై పోయిన కళ:

రాను రాను ఈ ప్రాచీన కళ క్షీణించి పోయింది. ఆదరణ లేక పోవటం వల్ల వంశ పారంపర్యంగా వస్తున్న ఈ వృత్తిని అభ్యసించడానికి వారి సంతతి ఇస్టపడక పోవటం వలన ఈ కళ దాదాపు అంతరించి పోయింది.

పందొమ్మిదవ శతాబ్దాంతానికి మన దేశంలో "రోప్ ట్రిక్" సేసేవారు లేకుండా పోయారు. కొంతమంది స్వార్థ పరులు తమ వద్ద నున్న

TeluguVariJanapadaKalarupalu.djvu

తాయత్తులను, వేళ్ళను, తాళ్ళను అమ్ముకోవటానికి తమకు తెలియని చిన్న చిన్న మేజిక్కులను ప్రదర్శించి ఈ కళను పూర్తిగా రోడ్ స్థాయి ప్రదర్శనంగా చేసేశారు. ఈ అద్భుత ప్రదర్శనను పునరుద్ధరించటం ఎంతైనా అవసరం.