Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/305

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
జంగం దేవర వేషం


మదిని దల్పర యని తాత్వికాన్ని ప్రబోధించేదీ వేషమని, భాగవతుల లక్ష్మి నరసింహం గారంటున్నారు.

మందుల వాళ్ళు:

సహజంగా భద్రాచల ప్రాంతం నుంచి గిరిజన జాతులకు చెందిన కోయ స్త్రీ పురుషులు, కొండ మూలికలు తెచ్చి ఆ మందులు ఏయే జబ్బులకు పని చేస్తాయో వాటిని వల్లిస్తూ బజారులన్నీ తిరుగుతూ ఏ జబ్బుకు ఏ మందు లున్నాయో ఏకరువు పెట్టటం మనకు తెలిసిందే.

అదే మాదిరి పగటి వేషధారులు ఓ వాత నొప్పులకు మందులు, ఓ కీళ్ళ నొప్పులకు మందులు, ఓ శిరో వాతానికి మందులు, ఓ సీత పైత్యానికి మందులు, ఓ కాళ్ళతీతలకు, అరికాలి మంటలకు మందు.