పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్కడ ఉజ్జయిని నగరంలో లీలావతి చెలికత్తెలతో ఆటపాటలతో అలిసి పోయి, దోమ తెర మంచంలో హాయిగా నిద్రిస్తూ వున్న సమయంలో దొంగ అయిన కర్ణకరుడు దొంగ చాటుగా ఆ ఒంటి స్థంభపు మేడకు కన్నంవేసి లీలావాతిపై మత్తుమందు చల్లి ఆమెను మంచంతో సహా కోట దాటించి అరణ్యంలోకి తీసుకొని పోతూ వుండగా మధ్యలో మేల్కొన్న లీలావతి దిగ్గున లేచి

దిగ్భ్రమ చెంది దుఃఖిస్తుంది. చెలికత్తెలందరిని పరస వరసన పేర్కొని విలపిస్తుంది. ఆ దొంగను అనేక విధాల శపిస్తుంది. రాజడండన తప్పదని వాణ్ణి వలువిధాల బెదిరిస్తుంది. ఏమీ పాలుపోక చివరికి భగవంతుణ్ణి వేయి విధాల ప్రార్థిస్తుంది. పుణ్యాత్ము లెవరైనా వచ్చి తనను రక్షించ వలసిందిగా అరణ్యమంతా దద్దరిల్లి పోయేటట్లు రోదిస్తుంది.

ఇంతలో ఆ అడవికి వేటకు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న మాళవ రాజుకు లీలావతి రోదన వినిపిస్తుంది. అతడు దిగ్గున లేచి రోదన వినిపించే దిక్కుకు వెడలి మంచంలో ఉన్న సుకుమారిని ఉజ్జయిని రాకుమార్తె లీలావతిగా తెలుసుకుని తగిన దండ ప్రయోగంతో దొంగల బారినుండి తప్పించి ఉజ్జయిని తీసుకుపోయి భోజరాజుకు అప్పగిస్తాడు. మాళవరాజు ఉపకారాన్ని మెచ్చుకున్న భోజరాజు లీలావతిని అతనికిచ్చి వైభోవోపేతంగా వివాహం చేస్తాడు. ఇదీ ఆ కథ.

దాదినమ్మా, నే దాదినమ్మ

దాదినమ్మా నే దాదినమ్మా
దాదిలో చిన్నదానవే యమ్మా
బాలనమ్మా నే బాలనమ్మా
బాలనపకీర్తి పాలైతినమ్మా
పుట్టకోటా, భూమి కోటా
కంచుకోటా, కల్వకోటా