పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చు. ఎఱ్ఱ కాగితాలను సన్నగా జూల్సుగా కత్తరించి లైటు ముందు విసనగఱ్ఱలాగ విసరినట్లయితే ఆ రంగు నీడలు మంటలుగా కనిపిస్తాయి. ఇలా మనకు కావలసిన ఇతర రంగులను ప్రకృతి దృశ్యాలను ప్రదర్శించ వచ్చు.

ముఖ్యంగా ఛాయా నాటికలు ఆయా సన్నివేశాల ననుసరించి నేపథ్య సంగీతాన్ని వినిపించడంతో ఎంతో రమణీయంగా వుంటాయి.

సురభివారి ఈత మట్టల బొమ్మలాట:

ఆంధ్ర నాటక రంగ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యం వహించే సురభి వారు ప్రారంభ దశలో ఈత మట్టల బొమ్మలాటల్నీ, తోలు బొమ్మలాటల్నీ, తరువాత నాటకాలను ప్రదర్శించారు.

సురభి కళాకారుల నివాసం పూనా సమీపంలో వున్న ఒక కుగ్రామం. శివాజీ ఆస్థానంలో ఉద్యోగులుగానూ, సేనానాయకులుగాను, ఉప నాయకులుగానూ వుండేవారు. వీరందరూ క్షత్రియకులానికి చెందిన వారు. వీరందరూ బహు విద్యావంతులుగాను, సంగీత సాహిత్యాలలో ఆరితేరినవారై యుండేవారు. శివాజీ, శంభాజీ గతించిన తరువాత, మహమ్మదీయ దండ యాత్రల్ని తట్టుకోలేక భార్య బిడ్డలతో వలసలు పోయారు. అలా వలసలు పోయిన వారిలో కొంతమంది బళ్ళారి, రాయ దుర్గం, అదోని ప్రాంతాలకు చేరుకున్నారు. వారినే అరెకాపులనేవారు.

దాత కరువు:

ఆనాడు దాత కరువుతో ఆంధ్ర దేశమంతా అలమటిస్తోది. వారితో తెచ్చుకున్న అభరణాలన్నీ అమ్ముకుని జీవించారు. తరువాత జీవనోపాధి కష్టమైంది. వారిలో అనేక మంది శ్రావ్యమైన గాత్రాలు కలవారున్నారు. పాటలను ప్రారంభించారు. తరువాత కొన్ని వినోద కార్య క్రమాలు ప్రదర్శించారు. కూటి కోసం కోటి విద్యలన్నట్టు ఆ తరువాత ఈత మట్టల బొమ్మలాటను ప్రారంభించారు. ఈత ఆకులను మట్టలతోను తీసుకు వచ్చి వాటిని ఎండ బెట్టి వాటిని బరువుకింద మణగిబెట్టి, వాటిని సైజులువారీగా, చిన్న పెద్ద పాత్రలు ఎంచుకుని , అయా పాత్రల ఆకారంలో ఆకులను బొమ్మల ఆకారంగా కత్తరించి, రామాయణ