పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/167

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆంధ్రనాటకము లనేకము లుండెను. వీనికి యక్షగాన నాటకములని ప్రసిద్ధినామముండెను. వానిని రాజగృహములలో నేమి, ధనికుల ఇండ్లలో నేమి, వీధులలో నేమి చక్కగా ప్రదర్శిచుచుండిరి.

ఈ నాటక సాంఘికులలో అనేకులు పండితులుండిరి. వారి వంశస్థులు ఇప్పటికీ అచ్చటచట నున్నారు. వారు ఘట్టుదేశపువారు, లేపాక్షివారు, ధర్మపురి వారు- భాగవతుల రంగయ్యగారు (కూచిపూడి) మొదలగు వారు దేశ దేశములు సంచరించుచు నాటకము లాడి పొగడిక గని వారని ఉదహరించారు.

తెలంగాణాలో యక్షగానాలు:

తెలంగాణాలో యక్షగానాలు దాదాపు నూరుకు పైగా వున్నాయని యస్వీ జోగారావు గారు తెలియజేస్తున్నారు. (తమ యక్షగాన వాఙ్మయంలో).

తెలంగాణాలో యక్షగాన రచన 18 వ శతాబ్దంలో విరివిగా సాగింది. యక్షగానాలకు ప్రదర్శన రూపంలో కాక, పురాణ పఠనం మాదిరి పారాయణంద్వారా ప్రారంభ దశలో ప్రచారం జరిగింది.

1780 లో రచింప బడిన, శేషాచలకవి ధర్మపురి రామాయణం, 1834 నాటి ముద్దకవి మంథన రామాయణం ఈ కోవకు చెందినవే.

ఆనాడు ధర్మపురి రామాయణం, ఒక్క తెలంగాణాలోనేకాక సర్కారు ఆంధ్రదేశమంతటా వ్వాప్తిలో వుంది. ఆంధ్రదేశపు ప్రదర్శకులు అందులోని దరువుల్ని చక్కగా వినియోగించు కున్నారు.

TeluguVariJanapadaKalarupalu.djvu

ఎటుతిరిగీ 19 వ శతాబ్దపు ఉత్తరార్ధం లోనే యక్షగాన ప్రదర్శనాలు రంగ స్థల మెక్కాయి. ఈ కాలంలో శేషభట్టరు కృష్ణమాచార్యులు, గోవర్ధన నరసింహాచార్యులు, దట్టము పాపకవి మొదలైన వారు యక్షగానాలు వ్రాశారు. ఆ నాడు యక్షగాన కవుల్ని మహారాజులు పోషించారు. ఆత్మకూరు మహారాజులు సంస్థానాధీశుడైన, ముక్కర సీతారామ భూపాలుడు రామదాసనే కవిచేత "తారా శశాంకం."భీమసేన విలాసం".