Jump to content

పుట:TeluguJaateeyamuluPartI.djvu/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగు జాతీయములు

81

నందక. 122 పు.
ఆఱు మూఁడైనను సరే, మూఁడు ఆఱ నను సరే
'6' అంకెలో ఒక సున్న. '3' అంకెలో సుమారుగ రెండు
సున్నలు కాననగును. కావున పరిణామము సగము పూజ్య
మైనను సరే, లేక పూర్తిగ పూజ్య మైనను సరే అనుట;
లేక, తలక్రిందు లైనను సరే అనుట. మొత్తముమీఁద——
ఏది యెటులైనను అని తన మనోనిశ్చయమునకు తెగిం
చుట నిది సూచించును.
ఆవగింజలో అరసగము కాలేదు
అరసగ మన నాలుగవవంతు. ఆవగిం జెంత? దానిలో
నాల్గవవం తెంత? అదియుఁ గా లేదఁట.
కావలసిన దంతయు ముందే యున్న దనుట.
ఆవులించినఁ బ్రేగులు లెక్కపెట్టు
ఆవులించిన నాకాలములోఁ గడుపులోఁ గల ప్రేవులను
లెక్కించి తెలిసికొను.
ఎంత కఠినవిషయ మైనను చూచినంతమాత్రమున కనిపెట్టు
అసామాన్య ప్రజ్ఞ గల అసాధ్యునివిషయమున నియ్యది
వాడఁబడును.
ఇంచుమించు
ఎచ్చుతగ్గులు (సుమారు)