Jump to content

పుట:TeluguJaateeyamuluPartI.djvu/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

తెలుఁగు జాతీయములు

సీ. అత్తమామలపోరు నారుదూ తెఱుఁగక
         పొందొంద నిచ్చ కాఁపురము దనరె
హంస. 4. 146
ఉ. ఆరును దూఱునుం బడియె నా చెలి యేమిటి కంటివేని నే
వీరును వారునుం బలెను వెట్టిదయన్ వలపింపలేదు ..
రాధా. 2. 18 పు.
తే. అంత నయ్యింతి యారుదూ రైనదాన
నైతినేకద తగువాని హత్తుకొన్న
నింతకన్నను నన్ను వీ రేమి సేయ
నేర్తు రని నెమ్మనమ్మున నిశ్చయించి.
శుక. 3. 141 పు.
ఆర్చు పేర్చు
విజృంభించు
ఆ. ఆర్చి పేర్చి మారుఁ డారీతి నేయంగఁ
గూర్చి కూర్చి చొల్లు గార్చికొనుచు
మూర్ఛ దెలిసి తనదుముం జేయి నోటిలోఁ
దూర్చి యతనిఁ గూర్చి దుఃఖపడియె.
చంద్ర రేఖావి. 2. 42
ఆర్చు, తీర్చు
విచార ముడుగ నూరార్చు, కోర్కి తీర్చు (ఈడేర్చు)