Jump to content

పుట:TeluguJaateeyamuluPartI.djvu/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగు జాతీయములు

5


ఉ. ఆడదుగాని మాట లోక యంచుక యించుక వీను లొగ్గి నా
యాడిన మాట లెల్ల విను వర్మిలితోఁ దను నేను జూచినం
జూడదుగాని యొందు దెసఁ జూచినఁ దానును జూచుచుండు
నీజాడలు నాపయి దగులు చందము డెందముఁ జేర్ప
నేర్పగున్.
శృం. శా.2. 42 పే.
అంజనమున మాటలాడ వేల?
దొంగతనములు మున్నగునవి జరిగినపుడు చోరులు నెఱింగి కొనుట కొకరకపు టంజనము వైతురు. ఆ అంజనమున నెవరో కనఁబడి చోరవిషయమును దేట తెల్లముగ నెఱిఁగింతురఁట. అటు లంజనము వేసి విషయ మెఱిఁగికొను సమయముని వేఱి తాను మాటలాడు టనవసరము గదా.

స్పష్టముగఁ దెలియుచున్న దాని విషయమై యుక్తులు, కుయుక్తులు, కాళయుక్తులు, ననవసరము లనుట.

ద్వి. అప్పటి నాపాటు లన్నియు మీకుఁ
జెప్పంగ' నేల యా శివునకే తెలియు
సంజనంబున మాట లాడ నేమిటికి
ముంజేతి కంకణంబున కద్ద మేల ?
సారం. 1. 844

అంజలి గుంజలి యార్చు

చేతులతోఁ బట్టుకొని నులిమి వైచు.