Jump to content

పుట:TeluguJaateeyamuluPartI.djvu/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

తెలుఁగు జాతీయములు

క. మది నూఱడు మిఁక నీతలఁ
పుఁ దలంపn గూడె నాడఁ బోయిసతీర్ధం
బెదురుగ వచ్చిన క్రియ ని
మ్మదిరేక్షణ తాన వచ్చె మనకడ కర్ణిన్
దశకు. 3. 142
ద్వి. పుడమిపై మరుఁడ! నీ పొందు నేఁ గోరి
తడ వాయె నేఁటికి దైవయోగమున
నాడఁ బోయినతీర్థ మరు చెంచినట్లు
నేఁడు మోహము దీఱ నినుఁ జూడగంటి.
సారంగ. 1. 571
ఉ. ఆడఁగఁ బోవు తీర్థ మెదురైన విధంబున నెల్లి యేను తే
పాడియ చంద్ర శేఖరు నుపాస్తి యొనర్చి...
హరవి. 7. 123
ఆడుచుఁ బాడుచు
ఉల్లాసపడుచు ననాయాసముగ
ద్వి. ఆడుచుఁ బాడుచు నభిమతార్థములు
వేఁడుక భక్తులు. వేఁడిన నిత్తు
ప్రభులి. 14. 112 పు.
ఆతతాయి
దుడుకువాఁడు, అల్లరివాఁడు, దుష్టుఁడు, చంపఁ
దయారయినవాఁడు.