Jump to content

పుట:TeluguJaateeyamuluPartI.djvu/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగు జాతీయములు

53

సీ. తే. చెదర కఱకాలఁ గన్ను వచ్చిన విధాన
నాథసం కేతముల కేఁగు నడికి రేలు
కాయసంభవబాధాసహాయ మగుచు
స్వైరిణీకోటి నిర్భయస్వైరధాటి.
పాండు. 4, 28
అఱకాల ముల్లు గొనక
మెత్తని అఱకాలిలో ముల్లైన గ్రుచ్చుకొనక
నిరపాయముగ, నిరాటంకముగ అని భావము.
క. అఱకాల ముల్లు గొన కిటఁ
దిరిగి రఘుస్వామి యేఁగుదెంచున్ మదిలోఁ
దరుణీ! వెఱవకు విపినాం
తరమున నిను విడిచి పోకఁ దగ దిఁక నాకున్.
రామాభ్యు. 5. 172
అఱకాలఁ బెట్టి నేల రాయు
అఱకాలిక్రింద వైచికొని మట్టిలోఁ గలిసిపోవునట్లు
రాచి వైచు.
సమూలముగ రూపు మాయునట్లు చేయు.
తే. కాని పదరకు మిఁక్రమిఁద దానిమోము
గనఁగవ ద్దని శౌరినిఁ గట్టి పెట్టి
బింకములు కూల నఱకాలఁ బెట్టి నేల
రాచకున్నను నా పేరు రాధ గాదు.
రాధి. 3 ఆ.