ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తెలుఁగు జాతీయములు
41
అద్దు, ముద్దు
ముద్దు, మురిపెము
క. హ ద్దెఱిఁగిన ప్రాఁజదువుల
ముద్దియలకు సద్దుముద్దు మురు వొసఁగెడువాఁ
డద్దిర! తలిదండ్రుల కటు
ముద్దులు చూపంగఁ దొడరె మోహముఁ బెనుపన్
రామకథా. బాల. 5. 353
ఆ. అద్దు ముద్దు మీఱి యాడది మగఁ డంచు
గూడి మాడి యాడ జూడఁ దలఁచి
బలిమి విందుఁ బెట్టి పగఁ గొన్న చందానఁ
బెండ్లి చేసి నేనె బేల నైతి.
రాధి. 3 ఆ.
అద్వైతము
చాద స్తము
అనఁగి, పెనఁగి
కలసి మెలసి యుండి
తే. పెనిమిటియు నీవు మచ్చిక నసంగి పెనఁగి
మగువ! నామీఁది పక్షంబు మఱువకమ్మ
రాజ శే. 3. 134.