పుట:TeluguJaateeyamuluPartI.djvu/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగు జాతీయములు


అం అనిన ఢం అన నేరఁడు

ఏమియు రాని మూఢుడు
ఓ అనిన న రాదు అన్నట్టు

ఉ. అక్కట! పొట్ట చించిన నొ కక్షర మైనను రాదు టెక్కులుం
    డక్కులు గాని య మ్మనిన ఢమ్మన నేర్వడు వేదమందు సొం
    పెక్కిన యన్ని విద్యల నహీనుఁడ నేనని కాపువారిచే
    మ్రొక్కులు గొంచు నాతడు సమున్నత గర్వము హత్తివర్తిలున్

శుక.2 ఆ.96 పే

అంకకాఁడు

చలపాది, కలహప్రియుఁడు

తే. ఎలసి యేప్రొద్దుగను బొంద నీక మరుఁడు
    కలహమున కంకకాఁడయి కాలు ద్రవ్వఁ
    బాండుబహుళక్షపాపరంపరలు వెడల
    నింటిలో నేదుముల్లయ్యె నిందుముఖికి.
                            ఆము. 5. 84