పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7 తిలక్ సాహిత్యపరిషత్ (క్రీ.శ. 1999) : ప్రఖ్యాతకవి తిలక్ పేరిట, ఈ సంస్థ క్రీ.శ. 1999లో స్థాపించబడింది. తిలక్ ਹੇਹਾਦਤ అభ్యుదయ, భావకవిత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, కవితల ෆිෆිජීප నిర్వహణ, ప్రజలను చైతన్యపరచడం, సాహిత్యప్రసంగాలను ఏర్పాటు చేయడం, శాస్త్రీయదృక్పధాన్ని అలవరచడం ఈ సంస్థ ప్రధాన ధ్యేయాలు. తిలక్ సోదరుడు శ్రీ దేవరకొండ గంగాధరరామారావు అధ్యక్షుడిగా, శ్రీ దేవరకొండ శివకుమారశాస్త్రి గౌరవాధ్యక్షుడుగా, కవిశ్రీ మోహన్ ప్రసాద్ కార్యదర్శిగా, జి.ఎల్.ఎన్.మూర్తి సహాయకార్యదర్శిగా దీని తొలికమిటీ ఏర్పడింది. అయితే ఈ సంస్థ తరపున చెప్పకోతగినంత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించలేక పోవడం బాధాకరం. పెద్దలు దీనిని నడపడంలో తగిన శ్రద్ధ చొరవలను చూపాలి. చిరుకళావేదిక (క్రీ.శ.2006) : 攀 బాలలకోసం, బాలలచే స్థాపించబడిందీ కళాసంస. బాల { బాలికల్లో జన్మతః సిద్ధించిన కళలను ప్రోత్సహించి, వారి ప్రతిభను పది మంది ముందు ప్రదర్శింప చేసేందుకు అవకాశ : కెమివ్వడం ఈ స ంస్థ ప్రధాన ఆశయం. 12-9-2006న డా| శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించబడింది. బాలలకోసం శిక్షణాతరగతులు, అనేక అంశాలలో పోటీలు, పలు సందర్భాలలో ప్రదర్శనలు నిర్వహించింది. అనేక మంది బాలకళా కారులకు వేదికలు కల్పించింది. వివిధకళలలో నిష్ణాతులైన బాల కళాకారులను | ఎంపికచేసి వారికి 'కళాశ్రీ పురస్కారాలనిచ్చి సత్కరిస్తోంది. ఉన్నతవిద్యనభ్యసించి కళాభిమానులై కళలకు విశేషంగా సేవలందిస్తున్నవారికి "విజ్ఞాన కళాప్రవీణ” పురస్కారాన్ని అందజేస్తోంది. తన చిరుకార్యక్రమాలకు వేదికగా, కార్యాలయంగా 'బాపుబొమ్మరిల్లను ఏర్పాటుచేసుకుంది. దీనిని డా| తాతిన రామబ్రహ్మంగారు ప్రారంభించారు. పి.ఎన్. సూర్యతేజ అధ్యక్షుడుగా, శశిదీప్తి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఈ సంస్థలో కార్యవర్గసభ్యులందరూ బాలలే ఉండటం ఒక విశేషం. బాలలే సభాధ్యక్షస్థానాన్ని అలంకరించి సభను నిర్వహించడం, వ్యాఖ్యాతలుగా వ్యవహరించి కార్యక్రమాలు నడిపించడం మరోగొప్పవిశేషం. 雷 1-ܓܠ @83) ク

ཡོད་,

"!=