పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

/് -S మాధవరామశర్మ "నృత్తరత్నావళి (కాకతీయుల నాటి జాయ సేనాపతిదేమో!) లాంటివి కొన్ని ಕ್ರಾತ್ರಾ సుబ్బరాయశాస్త్రి, మల్లాది సూర్యనారాయణ శాస్త్రి, వేదుల రామ ল’ৰ্ট, కాశీ కృష్ణాచార్యులు, తల్లావరుల శివశంకరశాస్త్రి, ఏటుకూరి వేంకట నరసయ్య, తుమ్మల సీతారామమూర్తిచౌదరి, జమ్మలమడక మాధవరామశర్మ భారతుల మార్కండేయశర్మలాంటి వారెందరినో ఈ సంస్థ సన్మానించింది. ఈ సంస్థ ద్వారా తిమ్మరాజుగారు వెలువరించిన గ్రంథాలన్నీ ఒక ఎత్తు, అనేకమంది వ్యాసాలు, రచనలతో వెలువడ్డ వారి "సాహితీవాల్లభ్యం మరో ఎత్తు. తిమ్మరాజు గారు స్వయంగా ఈడ్పుగంటి రాఘవేంద్రరావు గారి చరిత్రను ప్రచురించారు. తన అర్ధాంగి శ్రీమతి కమలాదేవిచేత ఉత్తర భారతదేశ యాత్రలు వ్రాయించారు. ఈ సంస్థద్వారా తమ సాహితీ సామ్రాజ్యాన్నిసైతం సుస్థిరపరచి, విశ్వవ్యాప్తం చేశారు: ఇంతటి చరిత్ర కల్లిన నరేంద్రనాథ సాహిత్యమండలి"ని, తిమ్మరాజుగారి వారసులు, పారిశ్రామికంగా నేడు ఎంతో ప్రఖ్యాతులు అయిన ముళ్ళపూడి వంశస్టులు మళ్ళీ పునరుద్ధరించి, గతవైభవాన్నికల్లించాలని తణుకుపట్టణంలోని సారస్వతప్రియల ఆకాంక్ష త్యాగరాజ ఆరాధన ఉత్సవ సొసైటి (క్రీ.శ. 1950-60) : 1940 ప్రాంతంలో తణుకులో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా హరికథలు, సంగీత కచేరీలు నిర్వహించబడేవి. 1950-60 సం||ల మధ్య అనేకమంది పురప్రముఖులు వారి సారధ్యంలో ඩීහීදී) త్యాగరాజఉత్సవాలుగా నిర్వహించడం మొదలుపెట్టారు. ఈ ఉద్యమ నిర్వహణలో డా| తేతలి సత్య నారాయణ, శ్రీ బంధకవి సీతారామాంజనేయులు, శ్రీ మంత్రిరావు సత్యనారాయణ రావు, శ్రీ ద్రోణంరాజు పద్మనాభరావు, శ్రీ చిర్రావూరి రామస్వామిశర్మ ప్రముఖంగా పాలుపంచుకున్నారు. తర్వాతకాలంలో శ్రీ ఇంగువ సీతారామయ్య ఒకే ఒక్కడుగా నిలిచి ప్రజల సహకారంతో ఈ ఉత్సవాలను సుదీర్ఘకాలం నిర్వహించారు. అనేకమంది జాతీయస్థాయి విద్వాంసులు, సంగీతకారులు ఈ వేదికపై తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమాలకు స్థానిక శ్రీ సీతారామాంజనేయస్వామి ఆలయప్రాంగణం వేదికగా మారింది. ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో వారంరోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వయోభారంవల్ల ఇంగువ సీతా రామయ్య విశ్రాంతి తీసుకోవడంతో, 1999లో శ్రీమతి మల్లిన భద్రమ్మ |అధ్యక్షురాలిగా శ్రీమతి భమిడి కమలాదేవి కార్యదర్శిగా కార్యవర్గాన్ని ఏర్పాటు] ー