పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ന്ന SY సహకారంతో ఒక చిన్న పెంకుటిల్లని నిర్మించారు. దీనిని సుప్రసిద్ధ దుర్గాబాయ్ దేశ్ ముఖ్ గుర్తించి, ఈ సంస్థకు నిధులను మంజూరు చేసారు. పెనుగొండ జమీందారు శ్రీ జవ్వాది లక్ష్మయ్యనాయుడు గృహ, వసతులను కల్పించి ధన సహాయాన్నిసైతం చేసారు. లక్ష్మయ్యనాయుడి సహాయంతో, ప్రభుత్వ నిధులతో, పురప్రముఖుల అండదండలతో ఈ సమాజం ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వ హించింది. దీనికి 1600 చ.గ. స్థలంలో శాశ్వత భవన నిర్మాణం చేసారు. 1968లో మహిళలకోసం తెలుగుపండిట్ కోర్సులను ప్రవేశపెట్టారు. SAOČóo కోసమై ఓరియంటల్ కళాశాలను స్త్రీసమాజంలో స్థాపించారు. దీనిలో చేరిన విద్యార్థినులకు 53 సంస్టే ఉచితంగా భోజన, వసతి సదుపాయాలు కల్పించేది. ప.గో.జిల్లాలో స్త్రీలకోసం ప్రత్యేకంగా నెలకొల్పబడిన ఏకైక విద్యాసంస్థలలో ఇదే మొదటిది కావడం ఒక విశేషం. తర్వాత కాలంలో తెలుగుపండిట్ కోర్సులకు ఆదరణ తగ్గిపోవటంతో 1992లో ఓరియంటల్ కళాశాలను మూసివేసారు. 1970లో పాదరక్షల ဇံဗဲရွှံဗိ కేంద్రాన్ని స్థాపించి తద్వారా బడుగువర్గాల మహిళ లకు ఉపాధి అవకాశం కల్పించారు. అయితే, 1984లో రాష్ట్రప్రభుత్వమే స్వయంగా పాదరక్షలకేంద్రాన్ని స్థాపించడంతో, ఈ సమాజంలో ఉన్న కేంద్రాన్ని కేంద్రాన్ని మూసివేసారు. ఈ బాలసరస్వతి స్త్రీసమాజానికి ఎందరో సేవలు చేసినప్పటికీ దేవులపల్లి సత్యవతమ్మగారి సేవలు చిరస్మరణీయం. సిద్ధి వీరేశ్వర నాట్యమండలి (క్రీ.శ. 1921) : 1921 సం||లో తణుకులో దీనిని ఇవటూరి ** సిద్ధివీరేశ్వరరావు సంస్మరణార్థం నెలకొల్పారు. ಸಿದ್ಧಿವಿರೆಸ್ಸೆರೆ రావు ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ ప్రఖ్యాత ఒ.జె.కూలై ప్రియశిష్యుడు. ఆయన వద్ద ఆంగ్లనాటక ప్రదర్శన పాటవాలు, దాని పోకడలు వీరేశ్వర నేర్చుకున్నారు. 'ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో వీరు వ్రాసిన నాటక రంగాన్ని గురించిన వ్యాసం ඩීට් అభ్యుదయ భావాలకి ః 毅 దర్పణం పడుతుంది. దురదృష్టవశాత్తు వీరేశ్వరరావు తీ జీడిగుంట బళేశ్వరరాశ కళాశాల విద్యని ముగించిన తరువాత హఠాన్మరణం చెందారు. వీరి జ్ఞాపకార్థమై ఈ నాట్యమండలి స్థాపించబడింది. దీని తరఫున "ప్రతాపరుద్రీయము, 'చిత్రనళీయము', 'చింతామణి', 'హరిశ్చంద్ర మొదలైన నాటకాలు ప్రదర్శించ బడేవి. శ్రీ జీడిగుంట బుచ్చేశ్వరరావు ఈ నాటక సమాజానికి మూలస్తంభంగా \S ーク H