పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

/7 SN నిర్వహించేవారు. ఈ గీతామందిరాన్ని సుందరమ్మగారు తన మేనకోడలైన మంచిరాజు రాజ్యలక్ష్మి, విశ్వేశ్వరశర్మ దంపతులకు 2-9-1986న వ్రాసిచ్చారు. 1986 సం||లో ఆమె తనువు చాలించారు. అయితే ఈ గీతామందిరం పూర్తిగా శిథిలంకావడంతో ఈ దంపతులు ఈ స్థలానికి ఎదురుగా ఉన్న ఇంట్లో అద్దెకుంటూ ఇప్పటికీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తున్నారు. ఒకప్పడు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిలయంగా ఉన్న ఈ గీతామందిరాన్ని ఆధ్యాత్మికవాదులు, పురప్రముఖులు నడుంకట్టి పునర్నిర్మాణం చేయాలి. తణుకు ప్రజల ఆధ్యాత్మిక పరమైన జీవనానికి ఈ గీతామందిరం తిరిగి ఆలంబనగా నిలవగలదని మనసా, వాచా, కర్మణా నేను నమ్ముతున్నాను. ఈ విషయమై ఉద్యుక్తులు కమ్మంటూ మరోసారి అభ్యర్థిస్తున్నాను. స్త్రీ సమాజం (శ్రీ బాలసరస్వతి స్త్రీసమాజం) (క్రీ.శ. 1917) : ~ ' తణుకు ప్రాంతంలో 1908 సం||ల కాలంలో గ్రామ 2ః స్త్రీలు వారానికి ఒకసారి ఒక్కొక్కరి ఇంట్లో సమావేశమై సత్మకథా కాలక్షేపాలను జరుపుకునేవారు. వీటిని కవయిత్రి జూలూరి తులసమ్మగారు ఆరంభించారు. 1912-14 ప్రాంతంలో డా|| హెచ్. సదాశివరావు సతీమణి శ్రీమతి సుశీలాదేవి ఆధ్వర్యంలో తణుకు ခြီးရွံ့ సమాజం SE పెంపొందించబడింది. ఆ సమయంలోనే కొవ్వూరి చంద్రారెడ్డిగారిచే జరుపబడ్డ కృష్ణాజిల్లా సభల్లో(ఇవి నిడుదవోలులో జరిగాయి) తణుకు స్త్రీసమాజంవారు పాల్గొన్నారు. తర్వాతకాలంలో, 1917-18:Solies తణుకు స్త్రీసమాజంగా ఈ సంస్థ ఏర్పడి భక్తి, సారస్వతాలను ధ్యేయంగా స్వీకరించి ముందుకు నడిచింది. సుప్రిద్ద సేవాసంస్థగా పేరుపొందిన ఈ స్త్రీ సమాజం వితంతువులకు, భర్తలు ఒదిలివేసిన మహిళలకు అండగా నిలిచేందుకు | 1932 సం||లో 'శ్రీ బాల సరస్వతి స్త్రీసమాజం' స్థాపించబడింది. 1925వ దశకంలో తణుకులో తహసిల్లార్గా పనిచేసిన శ్రీ యింటూరి కోటయ్యనాయుడు, | శ్రీమతి ప్రేమావతమ్మల ఏకైక కుమార్తె బాలసరస్వతి. ఈమె బాల్యంలోనే మరణించడంతో ఈమె జ్ఞాపకార్ధం తల్లిదండ్రులు ఈమె బంగారు నగలు దేవులపల్లి సత్యవతమ్మకిచ్చారు. విశేషమైన సంఘసేవకురాలిగా పేరొందిన |సత్యవతమ్మ కొందరు ఇతర మహిళలతో కలిసి ఈ సమాజాన్ని అభివృద్ధి పథంలో | నడిపారు. ఈ సంస్థ కార్యకలాపాలకు తొలుత శ్రీ పోతాప్రగడ అంకరాజు )- ܓܠ\