పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

/2-- N చేసింది. రామచంద్రపురం దీని చివరి కార్యస్థానం. ఈ సంస్థ 1980 వరకూ | బాగా వర్ధిల్లి, ఆంధ్రులలో భాషా విజ్ఞానాలను విరివిగా వ్యాపింపచేయడం ముఖ్యోద్దేశ్యంగా నడుపబడింది. ఈ గ్రంథమాలలో ఎక్కువగా వేంకట పార్వతీశ్వర కవుల రచనలు ప్రచురితమయ్యాయి. క్రీ.శ. 1911-30 మధ్యకాలంలో ఈ సంస్థ సుమారు 170 ప్రచురణ లను వెలయించింది. ఈ ప్రచురణలలో వచన గ్రంధాలు, నవలలు, కావ్యసంపు టాలు కూడా ఉన్నాయి. ఈ గ్రంథమాల తొలుత పరివర్తన గ్రంథాలు, ప్రేమ | ప్రధాన నవలలను ప్రచురించింది. అయితే, తర్వాత కాలంలో అపరాధ పరిశోధన నవలలవైపు మొగ్గుచూపి, తత్సంబంధమైన సాహిత్యాన్ని అందించింది. బాలాంత్రపు సత్యనారాయణరావు, 1946 ప్రాంతంలో, ఈ సంస్థ మేనేజింగ్ డైరక్టర్గా ఉండేవారు. ఆ రోజుల్లో ఈ గ్రంథమాల ప్రచురించిన పుస్తకాలు సుమారు లక్షకుపైగా అమ్ముడు పోయాయని తెలుస్తోంది. కొమర్రాజు వారి వంటి ఉద్దండుల "విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలితో సమానంగా ఈ గ్రంథమాల కూడా పుస్తక ప్రచురణలో అత్యున్నత స్థాయిని ෆිලධරයි. ඡටාකාංතිජි” ప్రారంభించబడిన ఈ గ్రంధమండలిని, తర్వాతకాలంలో నిడదవోలుకు చెందిన కొవ్యూరి చంద్రారెడ్డిగారు, ప్రధాన పోషకులుగా నిలిచి నడిపారు. అయితే, అతి చిన్న వయసులోనే వీరు మరణించడం, 'ఆంధ్రప్రచారిణీ గ్రంథమాలకు మాత్రమేకాకుండా, తెలుగుసాహిత్యప్రపంచానికే తీరనిలోటు. ෂී వేంకట పార్వతీశ్వరకవులరచనలు, చాగంటి సాళ్వాపంతుల వంటి వారి గ్రంథాలెన్నో ఈ సంస్థ ప్రచురణలలో ಹಿನ್:ಯು. - గీతామందిర్ (క్రీ.శ. 1913) : R. R. శ్రీ నల్లజర్ల నారాయణరావుగారి తండ్రి వెంకన్న 1913లో 'శ్రీరామపటమందిరం' నిర్మించే నిమిత్తం కొంత స్థలాన్ని శ్రీ చల్లా సుబ్బారాయుడు గారి దగ్గర కొన్నారు. 6-9- 1959వ తేదీన శ్రీ వెంకన్న కుమారుడు నారాయణరావు దీనిని రాయసం సోమసుందరం అనే సుందరమ్మగారి పేరున దస్తావేజులు వ్రాసి ఇచ్చారు. రాయసం సుందరమ్మ ఈ ఇంటిని 'శ్రీరామగీతా మందిరం'గా (మార్చారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలెన్నింటినో సుందరమ్మ ఒంటిచేతో అద్భుతంగా]