పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నారాయణమూర్తి, మంత్రిరావు వెంకటరత్నం లాంటి హేమాహమీల రచనలు దీనిలో ప్రచురింపబడేవి. ఈ పత్రిక ప్రతి మంగళవారం వెలువడేది. ఈ పత్రికకూ, సత్యవాదిని' పత్రికకూ మతసాంఘిక విషయాల్లో అభిప్రాయభేదాలు ఉండడంతో, వాద, ప్రతి వాదాలు నడిచేవి. తెలుగు పత్రికారంగ చరిత్రలో "సువర్ణలేఖ' ఒక సువర్ణఘట్టం. 20వ శతాబ్దపు తొలినాళ్లలో వెలువడ్డ ఈ పత్రిక, తణుకు ప్రాంతానికే గర్వకారణం. ది తణుకు క్లబ్ (హార్జింజి హాల్) (క్రీ.శ. 1910) : కో సర్వశ్రీ మంత్రిరావు వెంకటరత్నం, దొడ్డిపట్ల వెంకటరత్నం, యివటూరి సుందరయ్య, లంక వెంకటభద్రయ్య, సారంగు సోమసుందరం, ఈమని సత్య క్స్టివ్లో మున్సిఫ్) మొ! పెద్దల కృషితో ဧခဲဲ့ဒံ|| క్లబ్ ఏర్పాటుచేయబడింది. దీని ప్లానును అప్పటి ప.గో.జిల్లా అసిస్టెంట్ ఇంజనీర్ అయ్యదొరయ్య వేసారు. ప్రజలనుండి విరాళాలు వసూలుచేసి పురప్రజల సహకారంతో దీనిని నిర్మించారు. తొలినాళ్ళలో ఇది "హార్జింజి హాల్ అనే పేరుతో వ్యవహరించబడింది (హార్జింజి ప్రభువు ܦܶ.à.1910-16 KóoIIep మధ్య వైస్రాయ్గా ఉన్నారు). క్రీ.శ.20-21 సం||ల కాలంలో ఇది సహాయ నిరాకరణ ఉద్యమంలో సత్యాగ్రహులకు విడిదిగానూ, అనంతర కాలంలో జాతీయ విద్యాలయంగానూ నడిచింది. తరువాత ఇది తణుకుక్లబ్గా మారింది. శ్రీ యర్రమిల్లి దీక్షితులు క్రీ.శ. 1928లో దీనిని రిపేర్ చేయించారు. 1934లో దీనికొక స్థిరవాతవరణం ఏర్పడినతరువాత ఇది రిజిష్టరు చేయబడింది. ఈ క్లబ్కు అనుబంధంగా ఒక నాటకశాఖను ఏర్పరిచారు. దీనిలోని సభ్యులందరూ కలసి మంచి నాటకాలు ఆడుతూ, దీనికి కొంత మూలధనాన్ని ఏర్పరిచారు. శ్రీ తెన్నేటి కోదండరామయ్య దీనికి రూల్స్, బైలాస్ వ్రాసారు. స్వాతంత్ర్యానంతరం తణుకు క్లబ్గా మారిన తరువాత దీనికి శ్రీ వారణాసి విశ్వేశ్వరరావు ప్రెసిడెంటుగా ఉండి అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ క్లబ్లో తోటను న్యాయవాది శ్రీ గాది సుబ్బారావు పెంచారు. 1935 సంuలో అప్పటి రాష్ట్రపతి శ్రీ బాబూరాజేంద్రప్రసాద్ తణుకు విచ్చేసినప్పడు ఈ క్లబ్లో కదంబవృక్షాన్ని నాటారు. 8. ముళ్ళపూడి వెంకటరాయుడు, 3, ముళ్ళపూడి