పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

== -ސ2/ |కళా,సాహిత్యరంగాలకు ఆటపట్టుగా నిలిచింది. తణుకు చాలాపూర్వకాలంనుండి | నేటివరకూ చారిత్రక, కళా, సాహిత్యరంగాలకు పుట్టినిల్లగా భాసిల్లింది. ఆదికవి కళా, సారస్వతసమర్శనలో తరతరాల"తణుకు' ఒకనాటి వేంగిమండలంలోని పానారవిషయంలోని - తణుకు ప్రాంతం | నన్నయభట్టు, నారాయణభట్టు, పట్టమట్ట సోమయాజివంటి మహామహులు ఇక్కడ వున్నట్లు మనకు సుస్పష్టమైన చరిత్ర లభిస్తోంది. తూర్పు చాళుక్యుల ప్రధాననగరం, ఘటికాస్థానంకూడా అయిన రాజమహేంద్రవరాన్ని అనుసరిస్తూ తణుకు ఎప్పడూ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉందనాలి. 20వ శతాబ్దిలో |ఆధునికాంధ్ర సాహిత్య కళారంగాల చరిత్రలో తణుకులోని కొన్ని సంస్థలు, తొలినాళ్ళలో వెలువడ్డ పత్రికలు నిర్వహించిన పాత్రకూడా తక్కువేమీ కాదు. తణుకులో అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్న ఆయా సంస్థలు, పత్రికలు నిర్వహించిన విశిష్టభూమికను ప్రస్తావించడం ఈ వ్యాసం ముఖ్యోద్దేశ్యం. సువర్ణలేఖ (క్రీ.శ. 1905): "సువర్ణలేఖ" పత్రికను తల్లాప్రగడ సూర్యనారాయణ రావు పంతులు| గారు 1905, మార్చినెలలో స్థాపించి, మాస పత్రికగా ప్రకటిస్తూ వచ్చారు.| దీనిలో మత, సంఘ, విద్యా వ్యవసాయ, వాణిజ్య రాజకీయ, సారస్వత విషయాలు, ప్రహసనాలు, ခြီဥ့်ဗ సంబంధిత వార్తలు, వింతలు, చిత్రకథలు, ప్రసిద్ధ ఆంగ్లనాటకానువాదాలు ప్రచురితమయ్యేవి. ఈ పత్రికకు డి.వి. రమణరావు అధిపతిగాను, వెదురుమూడి శేషగిరి రావు మేనేజర్గాను వ్యవహరించారు. నెలకు 50 పేజీలు తక్కువకాకుండా ప్రచురితమయ్యే ఈ పత్రికలో, తెలుగు కవులను గురించి ప్రఖ్యాత వంగూరి సుబ్బారావు అనేక వ్యాసాలు వ్రాశారు. తల్లాప్రగడవారి 'వణిక్పుర వర్తకోదంతం అనే నవల మొదట ఈ పత్రికలో ప్రచురితమైంది. 1912లో ద్రోణంరాజు వెంకట రమణరావు దీనిని వారపత్రికగా మార్చి ప్రకటించారు. జగద్విఖ్యాతి పొందిన పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు వీరికి మామగారు. 1912లో ద్రోణంరాజువారు సంపాదకత్వం వహించిన కాలంలో, తన మేనమామగారు epox)3 పానుగంటివారి సాక్షివ్యాసాలను "సువర్ణలేఖలోనే όώόροηo ప్రచురించారు. పానుగంటి, వేంకట పార్వతీశ్వరకవులు, పెమ్మరాజు సీతా రామారావు, తల్లాప్రగడ సూర్యనారాయణరావు, జూలూరి తులశమ్మ అయ్యగారి