పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

rqm SSSSSSSSSSSS త్రిమూర్తులు కోడూరి దక్షిణామూర్తి, ధూళిపాళ రత్తయ్యశాస్త్రి ద్వయం పెనుగొండ కుమారస్వామి చెమటూరి వీరనరసింహపంతులు కోడూరి దక్షిణామూర్తి : ఆంధ్రభాషలో అందెవేసిన చేయి. స్వస్థలం | బ్రాహ్మణగూడెం. తణుకు పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసి, అందరిమెప్పూ పొందారు. పద్యాన్ని పద్యంలాగా, గద్యాన్ని గద్యంలాగా కదం త్రోక్కించి, చదవటం అనేదికూడా ఒక కళ అని ఋజువుచేసి ఈనాటివారికి ఆదర్శప్రాయంగా నిలిచారు. తెలుగంటే పురాణకాలక్షేపంకాదనటానికి వీరి క్లాసులే సాక్షిగా ఉండేవి. పాఠం చెబుతూ మనోఫలకంమీద బొమ్మలాడించి విడిచేవారట. | ధూళిపాళ రత్తయ్యశాస్త్రి : సంస్కృతభాషలో ఆరితేరిన పండితులు. గొప్ప | వైయ్యాకరిణి. వీరికి ఎంత పాండిత్యముండేదో వీరికే తెలియదు. తెలుసుకుందా మనుకునేవారికి అంతుదొరికేదికాదు. దర్పమెరుగని విద్య డాబులేని జీవితం. ఎప్పడూ చిరుమందహాసమే. సదా ఆదరణపూరితమైన వాక్కే పెనుగొండ కుమారస్వామి : “చిత్రలేఖనంలో విఖ్యాతులు. తాగీచిన గీటు సజీవ చిత్రణమై ఎదుటివారల పిలచి పలుకరింపజేయగల చిత్రనైపుణ్య సౌలభ్య శక్తి వీరిదని, మనిషి బొమ్మలుగీసి, చూచే మనుష్యులను బొమ్మల్లా నిలబెట్టే సిద్దహస్తుడీయనని" శ్రీ ఆలమూరి రాజగోపాలరావు వ్రాసారు. తణుకునుంచి | విశాఖవెళ్ళి అక్కడ ఎ.వి. ఎస్.కళాశాలలో చిత్రకకోపాధ్యాయులుగా కొంతకాలం | పనిచేసి రిటైర్ అయ్యారు. ඩීට් శిష్యపరంపరలో కడియం సుబ్రహ్మణ్యంలాంటి సిద్ధహస్తులెందరో పాలకొల్లు స్వస్థలమైనా తణుకుతోనే వీరి అనుబంధం. చెమటూరి వీర నరసింహం పంతులు : తణుకు వ్యాయామకళాకేంద్రాన్ని తొలిగా తీర్చిదిద్దిన వ్యాయామపులి వ్యాయామ శిక్షకులుగా విఖ్యాతులు. వ్యాయామమందు వీరివద్ద ఎందరో సుశిక్షితులయ్యారు. అనేకమంది పోలీసు డిపార్ట్మెంటుల్లో ఉన్నతాధికారాల్లో వివిధ విద్యాలయాల్లోవ్లో వ్యాయామ శిక్షకులు వీరి శిష్యప్రశిష్యులెందరో ఉన్నారు.