పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

|స్కూల్లలో ప్రాథమికవిద్య ఆరు నుంచి 11వ తరగతి| ܓܠ ఎవరెస్టు వీరుడికి శతకోటివందనాలు లెఫ్ట్నెంట్ మద్దిపాటి ఉదయభాస్కరరావు (1961-1985) వేణుగోపాల పూర్ణచంద్ర కళావతి, మద్దిపాటి | 雛 రామారావుల పుణ్యఫలంగా జూలై 10న తణుకులో & జన్మించారు. విమలాకాన్వెంట్, తణుకు ఎలిమెంటరీ వరకు కోరుకొండ సైనికస్కూల్లో చదివారు. పూనా సమీప నేషనల్ డిఫెన్స్ అకాడమీలో (ఎన్.డి.ఎ.) ఫైనల్ సెమిస్టర్లో అండర్ ఆఫీసర్గా పనిచేసారు. అదే సమయంలో ఇండియన్ ஜ் ఆర్మీకి సెలక్టయ్యారు. డెప్రకోడూన్లోని ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐ.ఎమ్.ఎ.)లో ఒక సంవత్సరంపాటు ట్రయినింగ్ పొందారు. వీరు హయ్యస్ట్ ಹsರೆತನೆ కాడెట్ ఆఫీసర్గా అరుదైన గౌరవం పొందారు. భాస్కరరావు హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్లో (హెచ్.ఎమ్. ఐ.)లో శిక్షణపొందారు. 1985లో ఇండియన్ఆర్మీ మౌంట్ ఎవరెస్ట్ అధిరోహణకు 42 మందిని ఎంపికచేయగా అందులో వీరొకరు. ఆ బృందంలో §) చిన్న వయస్సువారు కావడం ఒక విశేషం. హిమాలయాలలోని పాండిమ్ పీక్ తక్కువ ఎత్తే అయినా, దానిని అతి ప్రమాదకరమైన జోన్గా చెబుతారు. అందువల్ల ఆ పీక్ను అధికారికంగా అధిరోహించడానికి ఎవరికీ అనుమతిని ఇవ్వరు. పాండిమ్ పీక్ను ముగ్గురు అనధికారికంగా అధిరోహించగా, అందులో మన ఉదయ భాస్కరరావుగారు ఒకరు. మౌంట్ ఎవరస్ట్ అధిరోహణ సమయంలోనే భాస్కర రావుగారు వాస్తవానికి హిమాలయ కార్ ర్యాలీకి, అంటార్కిటికా యాత్రకు కూడా ఎంపికయ్యారు. అయితే ఈ లోపునే ఇండియన్ ఆర్మీ తరఫున ఎవరెస్ట్ అధిరోహణకు ఎంపిక కావడం, అధిరోహించి తిరుగుముఖం పట్టే సమయంలో దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. కోరుకొండ సైనికస్కూల్లో వీరి విగ్రహం నెలకొల్పబడింది. ఉదయభాస్కర్ పార్కును అక్కడ ఏర్పాటుచేసారు. స్వస్థలం తణుకులో ඕට් కాంస్యవిగ్రహం వెంటనే నెలకొల్పేలా సత్వరచర్యలు చేపట్టాలి. ఆ విధంగా జాతికి చెందిన నిజమైన హీరోలను మన గౌరవించు కున్నట్లవుతుంది. ఉదయ భాస్కర్ సోదరుడు మద్దిపాటి రాజశేఖర్ తన సోదరుడి ధైర్యసాహసాలు ప్రశంసిస్తూ, ఉదయభాస్కర్ జీవించివుంటే భారత ఆర్మీకి చీఫ్ అయ్యుండేవారన్నారు. సెల్యూట్ &טכ ఉదయభాస్కర్, § 3: $; ク