పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కడియాల సూర్యనారాయణ (1954) 25-5-1954న, కడియాల సుబ్బారావు, వీరమ్మ దంపతులకు తణుకులో జన్మించారు. బి.కామ్., కె వరకు తణుకులోనే చదివారు. తణుకు సమీప పైడిపర్రులో శ్లో 'రాజీవ్ ప్రజాపాఠశాలను, ఆర్యవైశ్య కళ్యాణమండప సమీప ప్రాంతంలో 'బాల్వాడీ స్కూల్ను చాలా కాలం నడిపారు. ధన సంపాదన మాత్రమే ఏకైక ధ్యేయంగా కాకుండా, తాను స్థాపించిన 'ది ఆంధ్రా కల్చరల్ క్లబ్ 、 ద్వారా అనేక సామాజిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలను నిర్వహించారు. 1995నుంచి ప్రతీ ఏటా తణుకులో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్.ఎన్.వి.టి. జూనియర్ కాలేజీ, ఇంటర్ విద్యార్థులు చాలామందికి వీరు యూనిఫామ్స్ అందించారు. స్థానిక కళాంజలి సంస్థకు ఇప్పటికీ చేయూత నిస్తున్నారు. తణుకు పాతూరులో శ్రీ కృష్ణుడు దేవాలయం నిర్మించారు. 'లయన్స్ క్లబ్ ఆఫ్ తణుకుకు 2009-2010 సం|నకు అధ్యక్షులుగా ఉన్నారు. 20102011సం||లకు రెండవసారి కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ తణుకుకు 3) 3 అధ్యక్షులు కావడం విశేషం. ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యుడు డా| వేల్చూరి గారి ఆధ్వర్యంలో గత 3సం||లుగా వీరు "మెగా ఆయుర్వేదిక్ క్యాంపు"లను నిర్విఘ్నంగా నడుపుచున్నారు. హైద్రాబాద్ నుండి డాక్టర్స్ను తీసుకువచ్చి ఫ్రీ హార్ట్ క్యాంపు తదితర కార్యక్రమాలను నిర్వహించి, అందరి మెప్ప పొందారు. శ్రీ కడియాల వారు రాష్ట్రస్థాయిలో కూడా వివిధ సంఘాలకు నాయకత్వం నెరపుచున్నారు. అఖిలభారత యాదవ మహాసభకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, రాష్ట్ర బి.సి. సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగాను ప్రస్తుతం కొనసాగుతున్నారు. ద్వారకా తిరుమలలో వీరు "శ్రీకృష్ణ యాదవ కళ్యాణమండపం సుమారు కోటి రూపాయల ఖర్చుతో నిర్మాణం చేయించారు. ఆ 3ဲ႕'ရွှံဓ మండపానికి వీరే ప్రధానదాత మరియు చైర్మన్. శ్రీ యనమల రామకృష్ణుడు, శ్రీ రఘువీరారెడ్డి, శ్రీ కోటగిరి విద్యాధరరావు කරටහී ರನ್ಜಿಯ రాజకీయ దిగ్గజాలతో వీరికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటీవల కాలం వరకు వీరు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. స్థానిక శాసనసభ్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారితో వీరికి విశేషమైన అనుబంధం ఉండడంతో, ప్రస్తుతం వీరు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో చురుకుగా ఉన్నారు. తణుకు ప్రజల దాహార్తిని తీర్చడానికి గోదావరి నీటిని తణుకు తీసుకువస్తున్న అపర భగీరధుడుగాకారుమూరి వారిని కడియాల సత్యనారాయణ అభివర్ణిస్తారు. ツ - ܓܠ -