పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(2- SN అజాత శత్రువు ఆకుల వెంకటేశ్వరరావు (జననం:1948) 홍 సావిత్రమ్మ ఆకుల వెంకట్రావులకు తణుకులో 11| 10-1948న జన్మించారు. తండ్రి భారతకమ్యూనిస్తు పార్టీ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్రనాయకుడిగా పనిచేసారు. 鄒 ంకటేశ్వరరావు తణుకు హైస్కూల్లో చదువుకున్నారు. Y ఇన్కమ్ టాక్స్ ప్రాక్టీషనర్గా దాదాపు 44 సం||లు పని చేసారు. సామాన్యకుటుంబంలో జన్మించి, నీతి నిజాయితీ లతో ఉద్యోగనిర్వహణచేసినందున సుప్రసిద్ధ ධපටි(3°ඩ්ජ వేత్త ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ వీరిపై సదభిప్రాయం ఏర్పరచుకున్నారు. 1995లో తణుకు పురపాలకసంఘానికి జరిగిన ఎన్నికలలో చైర్మన్ పదవి వెనుకబడిన కులాలకు కేటాయించడంతో ప్రసాదుగారు అనూహ్యంగా వీరిని తమ అభ్యర్థిగా నిలిపారు. శ్రీ ప్రసాద్ బలపరచిన అభ్యర్థిగా తణుకు పురపాలక సంఘానికి వీరు 3వ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. 1995–2000 సం||ల కాలంలో అందరి సహకారంతో, అన్నివర్గాలవారిని, పార్టీలవారిని మెప్పించి శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సఫలీకృతులయ్యారు. తణుకులో విశ్రాంతజీవితం గడుపుతున్న వీరు దాదాపు అన్ని సంస్థలు నిర్వహించే కార్యక్రమాలలోనూ చక్కగా పాల్గొంటారు. తణుకు ప్రజలకు వీరు అజాతశత్రువు. గోస్తని వంతెనపై శ్రీ రామకృష్ణసేవాసమితిద్వారా ఆదికవి నన్నయ విగ్రహప్రతిష్ట గోస్తని పూడికతీయించి తణుకు పట్టణం చుటూ వరదనివారణకు రిటైనింగ్ వాల్, 3.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు, హౌసింగ్బోర్డువద్ద చాలా కాలంగా అపరిష్కృతవంతెనకు అప్రోచ్రోడ్ ఏర్పాటు చేసి పట్టణాన్ని బైపాస్ రోడ్డుకు అనుసంధానం చేయటం, సంపూర్ణ అక్షరాస్యత వివిధ స్వచ్ఛందసంస్థల సహకారంతో 24 నిరంతర విద్యా కేంద్రాలవారికి సామగ్రి, వాలంటీర్లను ఏర్పాటుచేసి నిరంతర పర్యవేక్షణ, విద్యకు ప్రాధాన్యం కల్పించే సంకల్పంతో ఐదు స్వంత భవనాలు నిర్మించడం, తణుకు బాలుర ఉన్నతపాఠశాలకు నూతన భవననిర్మాణం చేయటం, ఎన్.జి.ఒ.కాలనీలో 20 లక్షల వ్యయంతో పబ్లిక్ హెల్త్ సెంటర్ ఏర్పాటు, హౌసింగ్బోరు కాలనీలో డా| బి.ఆర్.అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు, ముస్లింలకు చక్కని షాదీఖానా ఏర్పాటు, చాకలివారికి దోబిఖానా ఏర్పాటు లాంటి అనేకానేక ప్రజోపయోగకరమైన అభివృద్ధి కార్యక్రమాలు వీరి హయాంలో జరగడం వీరి కృషికి తార్మాణం. * * : ألكسسسسسسسسسسس -- ܓܠ\