పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

/-ਜ ਜਨ గమిని వెOకట సుబ్బారావు (రాజా) (జననం:1948) 14-1-1948న తణుకులో జననం. వెంకటేశ్వర్లు వీరి తండ్రి. రాజా పెద్దగా చదువుకోకపోయినా వ్యాపారాన్ని సమాజాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసారు. వీరి కుటుంబం తణుకుప్రాంతంలో విశేషమైన పేరు ప్రతిష్టలు ఆర్థించు కొంది. శ్రీ రాజా శ్రీ గమిని టెక్స్టైల్స్ పై లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా, స్థానిక జి.ఆర్.ఫిల్లింగ్ స్టేషన్ ప్రొప్రయిటర్గా, అసోసియేటెడ్ ఇంజనీరింగ్ వర్క్ పాండర్ మేనేజింగ్ పార్టనర్గా తణుకు ప్రాంతానికి సుపరిచితులు. రాజా వివిధసంస్థలలో మమేకమైపోయారు. 1987-89, 2001-02 సంuలలో లయన్స్ క్లబ్ ఆఫ్ తణుకు అధ్యక్షులుగా, 1989-90லி లయన్స్క్లబ్ ఇంటర్నేషనల్ జోన్ చైర్మన్గా, 2006-07లలో రీజినల్ ఛైర్పర్సన్గా, 200910లలో డిస్టిక్ట్ క్యాబినెట్ సెక్రటరీగా వివిధ హోదాలలో పనిచేసారు. 198586లలో ఆర్యవైశ్యసంఘం කිඳාදී ప్రధానకార్యదర్శిగా, 1986-87లలో ఆర్యవైశ్య మహాసభ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా 1986-98లలో ప.గో. జిల్లా ఆర్యవైశ్య సంఘం మేనేజింగ్ ట్రస్టీగా, 1989-97e మధ్యకాలంలో తణుకు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలతో ఆర్యవైశ్యకులస్థులకు ఆదర్శమయ్యారు. తండ్రి పేరున ఒక ఛారిటబుల్ ట్రస్ట్ను నెలకొల్పారు. 2002 సంl నుంచి వివేకా నంద ఎడ్యుకేషనల్సొసైటీ, తణుకుకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. తణుకు లైకోని సంధ్యాజ్యోతి, కళాంజలి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్టీస్ లాంటి సంస్థలలో లైఫ్ మెంబర్గా ఉన్నారు. ఆధునికంగా నెలకొల్పిన తణుకులోని & వేంకటేశ్వరస్వామి దేవాలయ డెవలప్ మెంట్ కమిటీ మెంబర్, శ్రీ కేశవ & మహాలక్ష్మీ అమ్మవార్ల దేవస్థానానికి 2001-08 సం||లలో మేనేజింగ్ ట్రస్టీకూడా, తణుకులోని ప్రతిష్టాత్మక శ్రీ నన్నయభట్టారక పీరానికి, శ్రీ రామకృష్ణ సేవాసమితికి వీరు కోశాధికారిగా వ్యవహరించి ఆయా సంస్థల పటిష్టతకు ఎంతో కృషిచేసారు. అనేక సామాజిక, పారిశ్రామిక, ధార్మిక, విద్యా, సాంస్కృతిక, సేవా సంస్థలకోసం ఇతోధికంగా కృషిచేస్తున్న శ్రీ గమిని రాజా తణుకుప్రాంతంలో ఒక గొప్ప తళుకు. ఆధ్యాత్మికరంగంలో మంచి అవగాహన ఉన్న ఈయన ఆధ్యాత్మికంగా మరింత |ఎత్తుకెదగాలని, సహృదయ మనస్వియైన వీరు సామాజిక, సేవా రంగాలలో మరింతగా రాణించాలని కోరుకుంటున్నాను. 裘娄装 س------ LSLSSSLSSSSSSS --ܠ