పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

| వర్మగారి జీవితం - ప్రజాఉద్యమాలకే అంకితం | దాల్లి వీర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వర్య (జననం:1946) | ప్రధానకార్యదర్శి, 2003 నుంచి జె.పి.జాతీయసమన్వయకర్త కావడంతో వీరు జూలై 1, 1946న జంగారెడ్డిగూడెంసమీప | శ్రీనివాసపురంలో జననం. సూర్యనారాయణమ్మ సత్య A నారాయణరాజు తల్లిదండ్రులు. తండ్రి ఎలిమెంటరీ స్కూలు *|టీచర్. వర్మగారు ప్రాథమికవిద్యను జంగారెడ్డిగూడెంలో, కళాశాల విద్యను ఏలూరులోనూ చదివారు. 1962లో / కమ్యూనిస్తుపార్టీ సూడెంట్స్ విభాగం ఎ.ఎస్.ఎఫ్.లో <_Y చేరారు. 1965 సం||లో రాష్ట్ర ఎ.ఐ.ఎస్.ఎఫ్. జనరల్ సెక్రటరీ అయ్యారు. 1964లోనే కమ్యూనిస్తు పార్టీలో చేరారు. 1986 నుంచి | జిల్లా కార్యదర్శిగా వ్యవహరించారు. రాష్ట్రకౌన్సిల్ మెంబర్గానూ ఉన్నారు. 1995 సం||లో కమ్యూనిస్తు పార్టీ నుంచి బయటకు వచ్చారు. 1995–2001 సం||ల మధ్య జిల్లా అక్షరాస్యతా సమితికి గౌరవ సలహాదారుగా ఉండి, అక్షరదీక్షలో ప్రధానంగా పాల్గొన్నారు. మూడు నెలల్లో అక్షరాస్యతా పుస్తకాలను రూపొందించి రాష్ట్రమంతా పంపిణీచేసారు. జిల్లాలో నిరంతర విద్యాకేంద్రాలకు గైడ్లైన్స్ వీరే రూపొందించారు. అక్షరయజ్ఞంద్వారా విశేషంగా కీర్తిగడించారు. කිඳාළු”ඳිඩ అన్ని పట్టణాలలో చైతన్యవేదికలు ఏర్పరిచారు. ఉద్యోగ, కార్మికసంఘాల 80ठ°°) ఐక్యవేదికలనూ రూపొందించారు. నిరంతర భూపోరాటాలతో వన సంరక్షణ సమితులు ఏర్పాటుచేసి ఆనాటి కమ్యూనిస్తు యోధులైన చంద్ర రాజేశ్వరరావు, నీలం రాజశేఖరరెడ్డి, నల్లమల గిరిప్రసాద్ వంటివారి దృష్టిని ఆకర్షించారు. తణుకులో జాతీయవేదికను ప్రారంభించారు. 28 స్లమ్స్లో నైబర్హుడ్ కమిటీస్ని ఏర్పరిచారు. డ్వాక్రా సంఘాలను ప్రభుత్వము ఏర్పరచక పూర్వమే 36 మహిళా పొదుపు సంఘాలను ఏర్పరిచారు. మురికివాడలలో హెల్త్కార్డ్స్ని ఇష్యూచేసారు. జాతీయ వేదికద్వారా ఆరోగ్యము మరియు విద్యలకు సంబంధించి తీవ్రంగా కృషిచేసారు. మున్సిపల్ కౌన్సిల్లో అవగాహనా తరగతులు నిర్వహించారు. 1993లో జాతీయస్ఫూర్తి పత్రికను ప్రారంభించారు. అనేక అంతర్జాతీయ సమావేశాలలో పాల్గొన్నారు. 1999లో లోక్సత్తా ఉద్యమంలో చేరారు. 2001లో లోక్సత్తా రాష్ట్ర రాష్ట్ర సమన్వయకర్త అయ్యారు. 2006లో పార్టీ ప్రధానకార్యదర్శి. 2010లో లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా అత్యంత కీలకమైన బాధ్యతలు చేపట్టారు.