పుట:Talli-Vinki.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భూమిక

దాస భారతీ ప్రచురణలలో నాలవదానిగా ఈ తల్లి విన్కి - లలితా సహస్రనామ వివృతి - ఆవిర్బవించినది. హరికథా రచనలు తరువాత శ్రీ దాసుగారు, అనేక గ్రంథములు అచ్చ తెనుగులోనే, నియమముతో రచించిరి. వారి అచ్చ తెనుగు అభిమానము ఈ క్రింద పద్యమువలన తేట తెల్ల మగును.

మొలక లేతదనము, తలిరులనవకము
మొగ్గ సోగదనము, పూవుతావి
తేనె తీయదనము, తెనుగునకేకాని
మోట లాతి నాటుమాటకేది.

నా అనుభవము, కొద్ది పరిశ్రమతో అచ్చ తెనుగు మాటల అర్థము తెలుసుకొనిన వారి రచనలు కడు సులువుగ సుబోధములగును. ఈ లలితా సహస్రనామ వివృతియందు ప్రతినామమును చక్కని అచ్చ తెలుగులో దాసుగారు వివరించిరి. పఠితలకు, మారు మూలనున్న అచ్చ తెనుగు పదములకు వెంటనే అర్థము చేసికొని అన్వయించుకొనుటకు, 32 పుటల "లఘు టిప్పణి" అకారాది క్రమములో ఇవ్వబడినది. దాని సాహాయ్యమున గ్రంథమంతయు అర్థము చేసికొని ఆనందించుటకు వీలగును.

ఈ గ్రంథము శ్రీ నారాయణదాసుగారు, పరిణత వయస్కులై, బాగుగా జ్ఞాన సముపార్జనచేసిన పిమ్మట సుమారు తమ ఎనుబదవ ఏట మొదలిడి, తమ అవతారమును చాలించు సమయమునకు పూర్తి చేసిరి. అట్టి వయస్సులో వారు వ్రాసిన చిత్తును తమ ప్రియశిష్యులైన పేరి నరసింహమునకు నోటితో చెప్పి శుద్దప్రతిని వ్రాయించెడివారు. తమ అవసాన కాలము సమీపించుచున్నదని ఎఱిగి తమ శిష్యుని శుద్ధప్రతిని కొన్ని సవ