పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/640

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

638 యిల నిహపరముల కెక్కినర్ధము యెలమి హీనునినైన యెక్కుడు సేసేయర్థము అలరి శ్రీవేంకటేశుఁడైన యర్ధము రేకు:0290-01 నాట సంపుటము: 03-518 పల్లవి: దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ కేరలీఁ బంతముల సుగ్రీవ నారసింహము చ. నిక్కిన కర్ణములతో నిట్టచూపు గుడ్లతో మిక్కుటమైన పెద్దమీసాలతోడ వెక్కసపు నోరితోడ వెలయు బుగ్గలతోడ క్రిక్కిరిసీ నవ్వుల సుగ్రీవ నారసింహము చ. చల్లు నూరుపులతోడ సంకుఁజక్రములతోడ మొల్లమైన సహస్రకరములతోడ తెల్లని మేనితోడ దిండైన పిరుఁదుతోడ కెల్లు రేఁగీఁ గరుణ సుగ్రీవ నారసింహము చ. విరుల పాదాలతోడ వెలయు సామ్మలతోడ తిరమైన కోటిసూర్యతేజముతోడ విరుల దండలతోడ వేడుక శ్రీవేంకటగిరిమీఁద వెలసె సుగ్రీవ నారసింహము రేకు:0069-01 సామంతం సంపుటము: 01-358 పల్లవి: దొరుకునా యితని కృప తుదిపదంబు అరిది విభవము లొల్లమనినాఁ బొదలు చ. సాంపలర నితఁడు కృపఁజూచు టరుదని కాక యింపు సామాన్యమా యితని కరుణ లంపటము ఘనమైన లక్షీకటాక్షములు సంపదలు తోడనే చల్లు వెదలాడు చ. తగ నితనిపై భక్తి తగులు టరుదని కాక నగుట సామాన్యమా ననచి యితఁడు జగదేక హితములుగ సరసతలు సౌఖ్యములు దిగులువాయఁగ నితడు దిప్పదీరాడు చ. తిరువేంకటాద్రి సిద్ధించుటరుదని కాక మరుగఁ దను నిచ్చునా మరియొకరిని యిరవైన భోగములు యిష్టసామ్రాజ్యములు విరివిగొని యితని దయ వెంటనే తిరుగు రేకు:0183-01 లలిత సంపుటము: 02-415 పల్లవి: దోమటి నింతెరఁగరా తొల్లిటివారు వామదేవవసిష్టవ్యాసాదులు చ. తానే దైవమైతే తపమేల జపమేల పూని సారెఁ బూజించే పూజలేల కూను వంగి యింటింటఁ గోరనేల వేఁడనేల యీనెపాన లోకమెల్లా నేలరాదా తాను చ. తగఁ దా స్వతంత్రుఁడైతే దరిద్రదుఃఖములేల నొగిలి వ్యాధులచేత నొవ్వనేల నగుఁబాటులైన జననమరణములేల ముగురువేల్పులదండ మొనచూపరాదా చ. శ్రీవేంకటేశుఁడే శేఖరపు దైవమని