పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/615

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

613 చ. అట్టే మాఁగుడు గప్పిన యద్దము దోమితేను గట్టిగా విశ్వ మెల్లాఁ బ్రకాశించినట్టు గుట్టున శ్రీవేంకటేశుఁ గొలిచి కృతకృత్యుఁడై దట్టపు హరి భక్తుఁడు ధర్మచిత్తుఁ డౌను పె.అ.రేకు:0068-03 సాళంగనాట సంపుటము: 15-390 పల్లవి: దేవ దేవ నీ దివ్యమహిమ లివి నీ వొక్కఁడవే నిఖిలకర్తవూ చ. అనిశము సురలకు నటు రక్షకుఁడవు దనుజులకు లయూంతకుఁడవూ దినముఁ బితాళ్లకు తృప్తికరుండవు జనుల కెల్ల సంసారసుఖమవూ చ. మునులకు సంతత మోక్షప్రదుఁడవు ఘనగ్రహములకు కాలమవూ అనయము సిద్దుల కక్షయ ఘటికవు నినుఁ గనువారికి నిధానమవూ చ. బహువేదములకు పరమార్ధంబవు సహజ జగములకు శరీరివీ మహిమల నలమేల్మంగకు మగఁడవు యిహమునకు శ్రీవేంకటేశ వరదుఁడవూ రేకు:0061-05 ధన్నాశి సంపుటము: 01-314 పల్లవి: దేవ దేవం భజే దివ్యప్రభావం రావణాసురవైరి రఘుపుంగవం చ. రాజవరశేఖరం రవికుల సుధాకరం ఆజానుబాహు నీలా భ్రకాయం రాజారి కోదండ రాజదీక్షా గురుం రాజీవలోచనం రామచంద్రం చ. నీల జీమూతసన్నిభ శరీరం ఘనవి శాల వక్షం విమల జలజనాభం తాలాహి నగహరం ధర్మ సంస్థాపనం భూల లనాధిపం భోగిశయనం చ. పంకజాసన వినుత పరమ నారాయణO శంకరాల్టత జనక చాపు దళనO లంకా విశోషణం లాలిత విభీషణం వేంకటేశం సాధు విబుధ వినుతం రేకు:0176-03 మాళవి సంపుటము:02-377 పల్లవి: దేవ నమో దేవా పావనగుణగణభావా చ. జగదాకారచతుర్భుజ గగననీలమేఘశ్యామ నిగమపాదయుగ నీరజనాభ అగణితలావణ్యాననా చ. ఘనవేదాంతైగణన వుదార కనకశంఖచక్రకరాంకా దినమణిశశాంకదివ్యవిలోచన అనుపమరవిజ9Oబాధరా