పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

164 చ. వుక్కుఁగంభములోఁ బుట్టి వుగ్రనారసింహుఁడు మొక్కలపు హిరణ్యుని ముందలవట్టి గక్కనఁ గడుపు చించి ఘనమైన పేగులు వెక్కసపు జంధ్యాలుగా వేసుకొన్నాఁడు చ. కోరలు దీఁడుకొంటాను ఘనోర నారసింహుఁడు సారె సారె నెత్తురులు చల్లుకొంటాను వీరులైన దానవుల వెదకి వెదకి కొట్టి గోరి కొనఁ గండలేల్లాఁ గోయుచున్నాఁడు చ. విచ్చిన విడిని శ్రీ వేంకటనారసింహుఁడు పచ్చిదేర నట్టే పకపక నవ్వి కచ్చు పెట్టి దేవతలఁగాచి యభియమిచ్చి పెచ్చు రేఁగి సంతోసానఁ బెరుగుచున్నాఁడు రేకు:0384-04 మాళవిగౌళ సంపుటము: 04-490 పల్లవి: అవధారు చిత్తగించు హనుమంతుఁడు వీఁడె భువిలోన గలశాపుర హనుమంతుఁడు చ. రామ నీ సేవకుఁ డిదే రణరంగ ధీరుఁడు ఆముకొన్న సత్వగల హనుమంతుఁడు దీమసాన లంక సాధించి వుంగరము దెచ్చె కామిత ఫలదు(డు Oూ ఘన పూనుమOతుఁడు చ. జానకీరమణ సప్తజలధులు లంఘించి ఆనుక సంజీవి దెచ్చె హనుమంతుఁడు పూని చుక్కలెల్లా మొలపూసలుఁగాఁగఁబెరిగి భాను కోటి కాంతితోఁ జొప్పడు హనుమంతుఁడు చ. యినవంశ శ్రీ వేంకటేశ నీ కరుణతోడ అనుపమ జయశాలి పూనుమOతుఁడు పనిపూని ఇటమీఁది బ్రహ్మపట్టమునకు నీ - యనుమతిఁ గాచుకున్నాడదే హనుమంతుఁడు రేకు:0226-01 సాళంగనాట సంపుటము: 03-144 పల్లవి: అవధారు దేవ హరికులరామ వివిధమై నీబంటు వెలయుచున్నాఁడు చ. అదె కలశాపురము హనుమంత రాయఁడు కదనములోన రక్కసులఁ గొట్టి యెదుట నిందరిలోన నేకాంగవీరుఁడై కొదలేక ప్రతాపించి కొలువై వున్నాఁడు చ. చల్లని వనాలనీడ సాగుడుఁ గొండలోన వల్లెగా వేసుకొన్న వాలముతోడ పల్లదాన వలకేలు పంతమున నెత్తుకొని కొల్లున మంటపములోఁ గొలువై వున్నాఁడు చ. పెక్కు పండ్లగొలలు పిడికిటఁ బట్టుకొని చక్కఁగాఁ బెరిగి పెద్దజంగ చాఁచి యిక్కువ శ్రీవేంకటాద్రి నిరవైన సర్వేశ గుక్కక నీపై భక్తిఁ గొలువై వున్నాఁడు రేకు: 0161-03 లలిత సంపుటము:02-295 పల్లవి: అవధారు పరాకు సేయకు మపరాధముగా నెంచకు వివరింపఁగ నీవే గతి విష్ణుఁడ మన్నించఁగదే