పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 1]

3

త గి న శా స్తి

  అందరు--శాబాస్, బాగా చెప్పినావు
  రామ--వీళ్ళుకోమలాంగులుకారు కొయ్యబొమ్మలు.
  పూర్ణే--చెత్తకుప్పలు.
  సూర్య--వాళ్ళకన్న మూగవాళ్ళు నయము.
  అందరు--సందేహమా? సత్యమే.
 ఉమా--సరే, ఐతే సాధనాంతర మేమి?
 రామ--మన ఈజన్మమే వృధా-ముందుజన్మములో  చూతాము.
 పూర్ణే--ఇంకో జన్మ ముంటేనా?
 సూర్య--మనము చేసిన పుణ్యానికి ఇంకో జన్మము కూడానా?
  ఉమా--ఎందు కీరచ్చ? ఉపాయమేదైనా చూడండి, ఊరకే గోలఎందుకు?
  పూర్ణే--నాకొకటి తట్టింది. వీళ్ళ పీకలు పిసికితే వీళ్ళు చస్తారు, అప్పుడు తగినవాళ్ళని పెళ్ళాడ వచ్చును.
  ఉమా--సరిసరి కూనీచేస్తే కోర్టుకి లాగుతారు.
  పూర్ణే--ఔనౌను మరచిపోయినాను.
  రామ--వాళ్ళంతట వాళ్లు చస్తే ఏచిక్కూఉండదు.
  పూర్ణే--అలాగు వాళ్ళు చస్తారా?
  సూర్య--భర్తని సుఖపెట్టడానికి భార్య లెందరు చావలేదు? ఆడవా ళ్ళాత్మహత్య చేసుకోగలరు.
  ఉమా--మ రేదైనా సాధన ముంటే చెప్పరాదా?