పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

19


క.

మును పది సంక్షేపముగా
వినిపించితి తత్కథన్[1] సవిస్తారముగా
మనమలరఁ దెలుపు మృదులవ
చనముల సుధ లొలుక మౌనిజనకులతిలకా.

74


చ.

అన విని పైలుఁ డిట్లను నృపాగ్రణితో నభిమన్యురేవతీ
తనయవివాహసత్కథ యథావిధిగా వినఁగోరి తీవు పా
వనుఁడు పరాశరాత్మజునివల్లను నాకు లభించినట్లు బో
ధనపడగా వచింతు ప్రమదస్థిరబుద్ధిని యాలకింపవే!

75


ద్వారకానగరవర్ణన

మ.

కల దభ్రంకషసౌధయూథవిహర త్కాంతాజనాలోకితో
జ్జ్వలగంగాతటినీతరంగచయచంపడ్డోలికామాలికా
కలనక్రీడిత రాజహంసమిథునాక్రాంతఁబునా ద్వారకా
విలసన్నామకరాజధాని యలరున్ విశ్రాంతసంపధ్గతిన్.

76


క.

ద్వారకవాటము కనక
ద్వారకవాటాభిశోభితస్ఫూర్తిసురు
ద్వారకనత్సౌధమహ
ద్వారకమై యొప్పె లవణవార్నిధినడుమన్.

77


ఉ.

ఆ పుటభేదనావరణ మభ్రతలోన్నతిగాగఁ దూఁగి యా
గోపురసాలముం గెలిచి గొబ్బున తజ్జయలక్ష్మి పెండ్లికై
ప్రాపుకుబోవ నొంటి ద్విజరాజశతంబును దుర్నిమిత్తము
ల్దా పొడగాంచి యవ్వలకుఁ దాటఁగ నిల్చినరీతి భాసిలెన్.

78


చ.

తిరముగ కోటకొమ్మలను దీర్చిన సద్గరుడోపలంబుల
న్నొరసి భుజంగరజ్జువులు స్రుక్క చికాకున నొంటి [2]కంటి తే

  1. తత్కథా-(లి)
  2. ‘బండి-మూ’