పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

17


క.

తృటితసముత్కటవిద్వి
ట్పటలికి పటుహాటకమయపటికసమమహా
కిటికి రమానికటికి వేం
కటమహిభృత్కిటికి పాణిఘటితసుకటికిన్.

63


వ.

సంతతనితాంత కల్యాణపరంపరాక్రాంత దిగంతవిశ్రాంతం బగునటుల నే రచియింపబూనిన తాలాంకనందినీపరిణయం బను శృంగారప్రధానప్రబంధంబునకు కథాసూత్రప్రారంభప్రకారం [1]బెట్టిదనిన-

64


కథాప్రారంభము

క.

జనమేజయనరపతి భూ
జనమే జయజయకరప్రశస్థితి బొగడం
గ నమేయదయాకీర్తుల
గన మేయెడ నితని కెనయగా నన నెగడెన్.

65


చ.

అతఁ డతులప్రభావమహిమాప్తిని సాత్యవతేయవాగుదీ
రితనిఖిలాగమాంత[2]సపరిష్కృతమైన పురాణకోటి సం
తతము తదీయశిష్యులు యథావిధిగా వినిపింప విన్చు సు
స్థిత నతినీతిసంయుతమతిన్ నుతికెక్కె కుతూహలోన్నతిన్.

66


క.

ఆ యనఘుఁడు కృష్ణద్వై
పాయనమునివలన బొడము భారత మమృతో
పాయనముగ విని వైశం
పాయనజైమినిసుమంతపైలులవలనన్.

67
  1. బెట్టిదంటేని - ‘తా’
  2. సుపరిష్కృత - ‘తా’