పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోకమాన్య బాలగంగాధర తిలక్

స్వరాజ్యం నా జన్మ హక్కు. స్వరాజ్య చైతన్యం జాగృతంగా వున్నంతకాలం నేను యువకుణ్ణే! నా విశ్వాసాలను ఏ అస్త్రమూ ఛేదింపజాలదు. ఏ అగ్నీ దహింపజాలదు. ఏ ప్రవాహం కూడా దానిని కొట్టుకొని పోజాలదు. ఏ ప్రభంజనమూ పెకలింపజాలదు. నా దేహానికి ముసలితనం వచ్చినా, నా చైతన్యానికి ముదిమి రాలేదు." అంటారు హోమ్‌ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించుటకు ముందు స్వాతంత్ర్య సమర శంఖారావం పూరించిన అప్రతిమ దేశభక్తుడు లోకమాన్య బాలగంగాధర తిలక్.

మహారాష్ట్రంలోని రత్నగిరిలో తిలక్ 1856 జూలై 23వ తేదీన జన్మించాడు. పార్వతీబాయి, గంగాధర రామచంద్ర తిలక్ అతని తల్లిదండ్రులు. తండ్రి గంగాధర తిలక్ సంస్కృతంలోను, ఆంగ్లంలోను, గణితంలోను పాండిత్యం సంపాదించి, విద్యాశాఖలో అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ అయ్యాడు.

బాలగంగాధర తిలక్ పూనాలోని దక్కన్ కాలేజీలో చేరి, గణిత శాస్త్రమును ప్రత్యేక విషయంగా చదివి ఇరువదవ ఏట పట్టభద్రుడయ్యాడు. ఎం.ఏ. చదవాలనుకొన్నాడు. కానీ వీలుకాలేదు. ఎల్.ఎల్.బి.పట్టా పుచ్చుకున్నాడు. విద్యావ్యాప్తి తన కర్తవ్యమని భావించిన తిలక్ 1880లో న్యూ ఇంగ్లీష్ స్కూల్ అను పాఠశాలను ప్రారంభించాడు. 1885 దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి గవర్నర్ ఫెర్గుసన్ పేర కళాశాల ప్రారంభించాడు. గోపాలకృష్ణ గోఖలే ఆ కళాశాలలో ఆంగ్ల