పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ముందు మాట

మాన్యమిత్రులు శ్రీ ఎన్. శివరామరెడ్డి గారు 'రైతులోకం' మాసపత్రిక ప్రధాన సంపాదకులుగా దాదాపు మూడేళ్లు పనిచేశారు. రైతులకు ప్రయుక్తమైన రచనలతో పాటు మహనీయుల జీవిత విశేషాలు గల వ్యాసాలు కూడా వుంటే బాగుండునన్న అభిప్రాయంతో సుప్రసిద్ధుల జీవిత విశేషాలను ధారావాహికంగా వ్రాయమని కోరారు. వారి కోరిక మేరకు ఇరవై పైగా వ్యాసాలు వ్రాశాను. అవన్నీ సచిత్రంగా 'రైతులోకం' లో వెలువరించినందులకు నమస్సులు.

పుస్తకంగా ప్రచురించి ప్రోత్సహించిన విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారికి నా కృతజ్ఞతలు.

జానమద్ది హనుమచ్ఛాస్త్రి