పుట:Sukavi-Manoranjanamu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

సుకవి మనోరంజనము


లాపురికిఁ గోణపదిశాముఖాంతరమున
భూతపతి కుక్కుటేశుండు ప్రీతి నుండు.

74


గీ.

కుక్కుటేశ నటేశ ప్రాక్షోణిదేశ
పాద గయవారి మునిగెడు పంచజనుఁడు
ఘోర భూరి జవంజవాపార వార్థి
మజ్జనము సేయఁ డిఁక ధరామండలమున.

75


గీ.

తత్పదాయుధపతి సముద్యచ్చిరత్న
రత్నవలయ గేహఘంటికారవము జనుఁడు
వినిన వినకుండు మహిషవాహన లులాయ
కంఠభాగ్ఘంటికా ఘలంఘలరవంబు.

76


గీ.

భుజగభూషణు మందిరంబునకు భక్తి
[1]తో ప్రదక్షిణములు సేయు నాప్రపూజ్యు
చుట్టునెపుడు దిరుగుదురు సూరిసుకవి
సుజన రాజరాజులు గ్రమ్మి సురుచిరముగ.

77


గీ.

కుక్కుటేశ్వర మందిర క్షోణిరజము
వక్షముల సోక మ్రొక్కు నా భవ్యతముల
వక్షములు చెలువొందు దేవాంగనా కు
చ లికుచాంచిత మృగమదచర్చచేత.

78


గీ.

విధుకలాపుని దివ్యసంనిధి వెలుంగు
తైల దీపాలిఁ గాంచు నా ధన్యతముఁడు
రత్నమణిదీపరాజి విరాజితోరు
భర్మ హర్మ్యాంతరంబుల వఱలుచుండు.

79
  1. 'లోన్' అనునది ద్రుతాంతము. ద్రుతసంధి ప్రకారము ఇక్కడ ‘తోఁబ్రదక్షిణ’ అని యుండవలెను. కాని అట్లున్నచో ఈ పాదంమం దుపయుక్తమైన ప్రాసయతికి భంగము కలుగును.