లక్ష్యము, హరిశ్చంద్రోపాఖ్యానము (1-129) —
ఉ. |
కౌశిక మౌనివర్య! కడఁకన్ నను ధన్యుని జేయఁగోరి వేం
చేసితివే, గృతార్థమతి చెందితి సాంగమహాధ్వరక్రియా
కౌశలపుణ్యసంపదలు గాంచితి మించితి రాజకోటిలో
వాసికి నెక్కి మీకుఁ దగు వాంఛితి సిద్ధియు వేడుఁ డిచ్చెదన్.
| 173
|
అందే (1-162) —
శా. |
కాశాకాశధునీతరంగచయనీకాశద్యుతిం దట్టమై
కాశం బొందఁగఁ జక్కఁగా సకలదిగ్భాగంబుల న్మన్మథుం
డేసెన్ పాంథజనవ్రజంబులపయి న్నేపార లీలాధను
ర్వైశారద్యము నివ్వటిల్ల ప్రసవాస్త్రశ్రేణులన్ బెల్లుగాన్.
| 174
|
పద్మపురాణము —
ఉ. |
ఆ శతమన్యువైభవుఁ డహర్పతితేజుఁడు చంద్రచంద్రికా
కాశసమానకీర్తి యగు గౌరన మల్లన మంత్రి దిక్కులన్
వాసికి నెక్కి భక్తి ననివారణమై గుడికట్టె గట్టురా
మేశుఁ బ్రతిష్ఠచేసె నుతికెక్కగ నా మొలగూరి వాకిటన్.
| 175
|
అప్పన్న పరమభాగవతచరిత్ర —
క. |
ఆశీర్వదించి శుకుఁ డుచి
తాసీనుం డగుచు రాజు నంద నునిచి యా
వేశకృపామతి శాప
క్లేశవిషాదాత్ముఁ డగుచుఁ గృతనిశ్చయుఁడై.
| 176
|
భాస్కర రామాయణము (యుద్ధ. 1447) —
ఉ. |
వ్రేసియుఁ జీరియుం బొడిచి వ్రేసియు గ్రుచ్చియు చించి నొంచి బి
ట్టేసియుఁ గూల్చియుం బగుల నెమ్ములు రాల్చియు వ్రచ్చి నుగ్గుగాఁ
జేసియుఁ గంఠము ల్దునిమి చిందరవందరగాఁగ మోదినన్
గీశులు భీతినొంది తలకింపుచు రాఘవు మర్వు సొచ్చినన్.
| 177
|