పుట:Subhadhra Kalyanamu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా పేరును వులూచి - నను గనిరి వారు
నీ పౌరుషమ్ములు - నీ రూపుమహిమ
పనిగొని గీతరూ - పమున వెల్లడిగ
విని నిన్ను గామించి - వేడ్క దెచ్చితిని
నా కోర్కె లీడేర్చు - నాకేశతనయ
కైకొను మనెడు నా - కాంత నీక్షించి
నారద సద్బ్రహ్మ - చారి యానతిని
నిగిడి ఈ ధరమీది - నిఖిల తీర్థములు
పరగ చరించగ - సమయమ్ము గలిగె
పరగ ధర్మజునితో - పలికి వచ్చితిని
నీ మనోభీష్టంబు - నే నెట్లు దీర్తు
భామిని ! యనిన నా - పద్మాక్షి పలికె
ధర్మమేదియు ప్రాణ - దానము తోను
తుల దూగదని మహా - త్ములు వలుకుదురు
చేకొని తన్ను ర - క్షించిన మీకు
పాకశాసని ! వ్రత - భంగ మెక్కడిది
పరగ ధర్మస్థితి - పాంచాలికడను
నరగ మీ చేసిన - సమయమ్ము కాద
అనగ ధర్మ స్థితి - కాత్మ మోదించి
అచట పుత్రుని గాంచి - ఆనాతి కొసగి
మనమున నుప్పొంగి - మరునాడు వెడలె