పుట:Subhadhra Kalyanamu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29


యిన్ని విధంబుల - నున్న యా మౌని
జూచి సంతోషమున సుదతి యిట్లనెను
అడిగెద నని పూని - అతివ సుభద్ర
తనమనములోనున్న - తాత్పర్యమునను
చిత్సౌఖ్యరసలత - చిగిరించ గాను
ఉత్సాహమున మేను - ఉబ్బి పొంగగను
పలుకు పల్కుకు తేను - లొలుకగా నపుడు
పలికె దా నొకమాట - పద్మాయతాక్షి
అయ్య మీరేడస - మరసి చూచితిరో
యెయ్యది మీనామ - మెచట నుండుదురో
పరగ నింద్రపస్థ - పట్టణమ్మునను
బహుళ సంపదలతో - బరగు చున్నారె
ధీర మానసులు కుం - తీసుతుల్ వారు
అరయ గడు సఖు - లై యున్నా వార
కోరి మా మేనత్త - కొడుకు లైదుగురు
వారికి కుశలమా - వరముని చంద్ర
ఆ రాజవరులలో - నర్జునుండెలమి
ధారుణి తీర్థముల్ - దరిసింప నేగె
తీర్థముల్ క్షేత్రముల్ - తిరుగుచో మీరు
ఇంద్రనందను నెందు - నే జూడలేదా
జగస్తి నస్ంతట మీరు - చరియింతు రనగ