పుట:Sringara-Malhana-Charitra.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వర్ణితములైనవి. ధనదత్తుని (కోమటిసెట్టి) మాటలు, చేష్టితములు నవ్వును గొల్పుచుండును. ఆయాయిపట్టుల నాయాయి విషయములంగూర్చినవర్ణనము లిందు స్వభావోచితములుగ నలరారుచున్నవి. కవితావైభవమున నీగ్రంథ మాంధ్రభోజుఁడగు కృష్ణదేవరాయలకాలమున వెలసిన యితర సరసప్రబంధములకుఁ దీసిపోవక సహృదయహృదయంగమముగ నున్నది. 'తినఁబోవుచు రుచులెన్న నేల?' సహృదయు లాస్వాదింపనున్న యీ రసవత్ ప్రబంధమాధుర్యమునుగూర్చి యిట హెచ్చుగ ముచ్చటింపఁ బని లేదు.

మాకు లభించిన మాతృక యొక్కటియే యగుట చేతను, అదియు శిథిలమై, దోషభూయిష్ట మై యుండుట చేతను ఈ గ్రంథము నింతకంటె నిర్దుష్టముగ ముద్రింపఁజాలమికి మమ్ము మన్నింపఁ బండితుల వేఁడెదము. చివికి చెదలుపాలగుచున్న ప్రాచీనప్రబంధరత్నముల నుద్ధరించి యిట్లు సుందరముగఁ బ్రకటించుటకుఁ బూనుకొన్న మా కాంధ్రలోకము సాదరభావముతోఁ బాసటయై మున్ముందు నితోధికభాషాసేవకు మమ్ముఁ బురికొల్పుఁగాక యని విశ్వసించుచున్నాము.

మాకుఁ గోరినవెంటనే తమకడనున్న మాతృకను బంపిన ఈవని గ్రామనివాసులు శ్రీ శ్రీపతి పండితారాధ్యుల శరభసాళ్వ అయ్యవార్లుంగారికిఁ గృతజ్ఞతాంజలుల నర్పించుచున్నాము.


ప్రభవ జ్యేష్ఠ శుద్ధ

పూర్ణిమా

గంటి సూర్యనారాయణశాస్త్రి,

సౌమ్యవారము

సంపాదకుడు.