పుట:Srinadhakavi-Jeevithamu.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

266

శ్రీనాథక వి


దొడిగి తా మత్యంతాభిమానముతో ప్రేమించేడి కవిసార్వభౌముని గేలి సేయుట యెంతయు సంతాపకరమగు సంగతిగదా?

ఈ భావమును పోషించుట కొఱకే శాస్త్రి గారు శ్రీనాథుడు సంసార భారము మెండుగా నున్నను సాంసారిక సౌభాగ్యము నంతగా సమభమించిన వాఁడు కానట్టూట్టూ హించి చెప్ప సాహించిరి. ఈ భావ మును పోషించుట కొఱకే యాతని మేలైనయాహారవిహారము లను, ఉద్యానవిహారములను, కస్తూరికా సుగంధాంగ రాగాను లేపన ములను, స్వర్ణ పాత్రభోజనములను, విశాలాలోన్నత కాయమును, భోజన ప్రియత్వమును బ్రంసింపవలసిన వారయిరి.

ఇట్టి దుర్భావకల్పనము చేయుటకు దృఢతరమైన ఋజు భార మును వహిుపవలసి యుండును, చాటున జీకటిలో నేమో యున్న వని పట్టి ప్రగల్భ వాక్యములఁ బ్రచరించుటయే గాని వీరి శృంగార శ్రీనా ధమునం జూపగలిగిన దొక్క చాటు పద్యముదక్క మఱి యొండు గాన రాదు. ఆయ్యదీ శ్రీనాథుడు చెప్పుటకు సాధ్యము కాదని సరిగాగా విమర్శించిచూచిన పక్షమున నాయంశము దేటపడఁగలదు. పంచమాథ్యాయమున నాపద్యమును నుదాహరించి కొంత చర్చ సలిపి యున్నాను గాని యా పద్యము శ్రీనాథుని దగునో కాదో యంతగా జర్చింప లేదు. దానిని సవిస్తరముగా నిచట చర్చింతును.

శాస్త్రీ గారి ప్రమాణ చాటువు.

వీరి శృంగార శ్రీనాధమునం దా చాటు విట్లున్నది,

శా.అక్షయ్యంబగు పొంచ.. (నంబు), రాయని 'తెలుంగాధీశ ! కస్తూరికా బిక్షా దానము సేయుగా ! సుకవిరాడ్బం దారక శ్రేణికిన్", (స్వామికిస్ ) దాక్ష రామ చళుక్య భీమువర గంధర్వాప్సరో భామినీ పక్షోజద్వయ కుంభికుంభముల పై వాసించుఁదద్వాననల్


శాని యాంధ్రలోకమున విశేష వ్యాప్తినిగాంచిన పాఠమీట్లున్నది,