పుట:Srinadhakavi-Jeevithamu.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాధ్యాయము


అవసానకాలము

శ్రీ నాథకవి సార్వభౌముడు తన వార్ధక్యమునఁ బయి నుడివిన కష్టము లనుభవించి ప్రాణావసాన సనుమమున


 సీ. కాశికావిశ్వేశుఁ గలిసె వీరా రెడ్డి
రత్నాంబరంబు లేరాయఁడిచ్చు
రంభఁగూడె దెనుంగురాయ రాహుత్తుండు
కస్తూరి కేరాజ ప్రస్తుతింతు
స్వర్గస్తుడయ్యె విస్సనమంత్రి మఱి హేమ
పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు
కైలాసగిరి బండెమెలారు విభుడేగి:
దినవెచ్చ మేరాజుతీర్పఁగలఁడు

గీ.. భాస్కరుఁడు మున్నె దేవుని పాలి కరి గెఁ
గలియుగంబున నిక నుండ: కష్టమనుచు
దివిజకవివరు గుండియల్ దిగ్గురనఁగ
నరుగు చున్నాఁడు శ్రీ నాథుఁడమర పురీకి. "


అని యెల్ల వారికి జాలిపుట్టునట్లుగాఁ బయి సేసవద్యమును జెప్పి విచారముతోఁ బ్రాణములను విడిచెట, దీనిని సందు చేసికొని విషయవిమర్శను జక్కఁగాఁ జేయక ప యధ్యాయమున నుదహరించిన కవిరాజు కంఠంబుఁ

గౌగలించెనుగదా వురవీధి నెదు రెండ పొగడదండ ,

అను పద్యమును నిందలి పై సీసపద్యమును దాహరింపుచు శ్రీవీరేశ లింగము పంతులుగారు తష ఆంధ్రకవుల చరిత్రమునందు

"అవసానదశయం దిట్టికష్టములకెల్లను గారణము యౌవనదశ యందుఁ గామవశముచేత స్వేచ్ఛముగా విహరించి దేహమును ధన